Airtel New Plan 2023: ఎయిర్‌టెల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్.. రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్! మరెన్నో ప్రయోజనాలు
Airtel Increased Validity of Rs 359 Recharge Plan for Users. ఎయిర్‌టెల్ ప్లాన్ రూ. 359లో 28 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు నెల మొత్తం చెల్లుబాటు పొందుతారు.
Airtel Increased Validity of Rs 359 Recharge Plan for Users: కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం నెట్‌వర్క్‌లు నిత్యం ఎన్నో ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తక్కువ రీఛార్జ్‌తో ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలా ఎప్పటికప్పుడు ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. అయితే ప్రముఖ టెలికాం సంస్థ 'ఎయిర్‌టెల్' ఇటీవల తన చౌకైన ప్లాన్‌ను ఖరీదైనదిగా చేసింది. రానున్న కాలంలో ప్లాన్‌ల వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎయిర్‌టెల్ తన ప్లాన్ చెల్లుబాటును పెంచింది. దాంతో మరింత డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం మీరు ఉపయోగించుకోవచ్చు.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 359లో 28 రోజుల చెల్లుబాటు అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు మీరు నెల మొత్తం చెల్లుబాటు పొందుతారు. అంటే ఓ నెలలో 31 రోజులు ఉంటే.. ఆ నెల మొత్తం ప్లాన్ ఉపయోగించుకోవచ్చు. మరోవైపు ఒక నెలలో 30 రోజులు ఉంటే.. మీరు అన్ని రోజుల చెల్లుబాటును పొందుతారు. 'క్యాలెండర్ నెల వాలిడిటీ' (1 Calendar Month Validity)లోని రూ. 359 ప్లాన్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
రూ. 359 ప్లాన్‌లో రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఇది కాకుండా అపరిమిత కాలింగ్ అందుబాటులో ఉంది. ఇక రోజుకు 100 SMSలు వాడుకోవచ్చు. Airtel Xstream యాప్ 28 రోజుల ఉచిత సబ్‌స్క్రిప్షన్, SonyLiv, LionsgatePlay మరియు ErosNow సబ్‌స్క్రిప్షన్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ప్లాన్‌తో వినియోగదారులు అపోలో 24X7 సర్కిల్‌కు 3 నెలల సబ్‌స్క్రిప్షన్, ఫాస్టాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, హలో ట్యూన్స్ మరియు వింక్‌లకు ఉచిత యాక్సెస్ కూడా పొందుతారు.
Also Read: Boy Exam Hall: పరీక్షా హాలులో అమ్మాయిలు.. చూసి తట్టుకోలేకపోయిన ఇంటర్ విద్యార్థి! చివరికి ఏమైందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.