Akasa Air: బిగ్​ బుల్ రాకేశ్​ ఝున్ ఝున్ వాలా.. ప్రధాన ప్రమోటర్​గా ఉన్న బడ్జెట్ ఎయిర్​లైన్స్ 'ఆకాశ ఎయిర్​'​ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఈ సంస్థ కార్యకలాపాలను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సంస్థ సీఈఓ వినయ్​ దూబే ఓ ప్రకట కూడా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది జూన్​ నుంచి సంస్థ విమానాలను నడిపించే యోజనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆకాశ ఎయిర్​ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్​ (డీజీసీఏ)తో.. అవసరమైన లైసెన్స్​లను పొందేందుకు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు వినయ్​ దూబే.


హైదరాబాద్​లోని బేగంపేట్​ ఎయిర్​పోర్ట్​లో జరుగుతున్న 'వింగ్స్​ ఇండియా 2022' ఏవియేషన్ షోలో పాల్గొన్న వినయ్​ దూబే.. ఆకాశ ఎయిర్​ గురించి ప్రస్తావించారు. జూన్​లో మొదటి ఫ్లైట్​ను ప్రారంభించనున్నట్లు వెల్లడించిన దూబే.. ఏ నగరాల మధ్య నడుస్తుంది అనే విషయం మాత్రం వెల్లడించలేదు.


అయితే మొదటి ఫ్లైట్ ప్రారంభమైన తర్వాత.. ఏడాది లోపు మొత్తం 18 విమానాలను నడిపించనున్నట్లు వివరించారు. ఆ తర్వాత ఏడాదిలోపు మరో 12-14 విమానాలను సంస్థలోకి చేర్చుకోనున్నట్లు వెల్లడించారు దూబే. గత ఏడాది నవంబర్​లో ఆకాశ ఎయిర్​ 72 బోయింగ్​ 737 మ్యాక్స్ జెట్స్ కోసం.. ఆర్డర్ ఇచ్చింది.


Also read: Indian Exports: 2021-22లో భారత స్మార్ట్​ఫోన్ల ఎగుమతులు 83 శాతం జంప్​!


Also read: EPFO E-nomination: ఈ-నామినేషన్ దాఖలు అవసరం ఎంత? చేయకుంటే ఏమౌతుంది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook