కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల ఆర్ధికవ్యవస్థలు చిన్నాభిన్నమైతే..చైనా ( China ) మాత్రం పురోగతిలో ఉంది. అటు చైనా కంపెనీలు కూడా లాభాల్ని ఆర్జిస్తున్నారు. బిలియనీర్ల జాబితాలో చేరుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కుదేలు చేసేసింది. అగ్రదేశాలతో సహా అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థ ( Economy ) చిన్నాభిన్నమైన పరిస్థితి. కానీ వైరస్ ప్రారంభమైన చైనా ఆర్ధిక వ్యవస్థ ( China Economy ) మాత్రం  పుంజుకుంది. లాభాల దిశగా సాగుతోంది. చైనా త్వరగానే కోలుకుని లాభాలు సాదిస్తోంది. చైనాకు చెందిన కుబేరులు కూడా బిలియనీర్ల జాబితాలో చేరిపోయారు. కొత్తగా 257 మంది చైనా వాణిజ్యవేత్తలు బిలియనీర్స్ ( Billioneers ) లిస్ట్ లో చేరారు. చైనాలోనే అత్యంత సంపన్నుడిగా ఖ్యాతి గడించిన జాక్‌ మా ( Jack Ma ) కు చెందిన  ప్రముఖ హోల్ సేల్ ఆన్ లైన్ ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్..అలీబాబా ఈ కామర్స్‌ ( Alibaba E commerce ) సంస్థ ప్రపంచంలో ఎవరూ ఊహించలేనంతగా సంపాదించి కొత్త చరిత్రను సృష్టించింది. ఏడాదిలో 1.5 ట్రిలియన్‌ డాలర్ల లాభాలు గడించి అలీబాబా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆయన మొత్తం ఆస్తిలో 45 శాతం ఒక్క ఏడాది లాభాల ద్వారానే సమకూరినట్లు ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారంటే ఎంత సంపాదించారో అర్ధమవుతుంది.  


కరోనా వైరస్‌ సంక్షోభ ( Coronavirus crisis ) కాలంలో ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన కంపెనీలు కోట్లకు పడగలెత్తాయి. వ్యాక్సిన్లను తయారు చేసే ఝిఫీ కంపెనీ వ్యవస్థాపకులు జియాంగ్‌ రెన్‌షెంగ్‌ ఆస్థి కూడా ఏడాది కాలంలో 19.9 బిలియన్‌ డాలర్లకు అంటే మూడింతలు పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా చైనా జీడీపీ ( China GDP ) రేటు మైనస్‌లోకి పడిపోతుందని చాలా దేశాలు భావించాయి. అయితే దీనికి భిన్నంగా ఈ ఏడాది జీడీపీ ( GDP ) 4.9 శాతం ఉన్నట్లు తాజాగా విడుదలైన ఆర్థిక లెక్కలు చెబుతున్నాయి.  ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్‌ లాంటి దేశాల జీడీపీ రేట్లు మైనస్‌లో పడిపోగా, చైనా ఒక్కటే ప్లస్‌ వైపు దూసుకుపోవడం ఆశ్చర్యమే మరి. 


ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రదేశాల ఆర్ధిక పరిస్థితిని ఓ సారి పరిశీలిస్తే..యూకే ( UK ) ఎక్కువగా నష్టపోయింది. యూకే ఆర్ధిక పరిస్థితి కరోనా వైరస్ కారణంగా మైనస్ 20 శాతంకు దిగిజారిపోగా..ఫ్రాన్స్ ( France ) మైనస్ 18 శాతం, కెనడా ( Canada ) మైనస్ 13 శాతం, జర్మనీ ( Germany ) మైనస్ 12, జపాన్ ( Japan ) మైనస్ 10, యూఎస్ ( US ) మైనస్ 9,  ఆస్ట్రేలియా ( Australia ) మైనస్ 6కు పడిపోగా...చైనా మాత్రం అనూహ్యంగా 5 శాతం ప్లస్ లో ఉంది. Also read: Earthquake hits Alaska Coast: 7.5 మ్యాగ్నిట్యూడ్‌తో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ