Amazon Discount Offers: మరో పది రోజుల్లో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇవే
Amazon Discount Offers: మరి కొద్దిరోజుల్లో దసరా, దీపావళి పండుల సీజన్ ఉంది. అందుకే ఎప్పటిలానే ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ భారీ ఆఫర్లతో మరోసారి ముందుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో వివిధ ఉత్పత్తులపై ఆఫర్ల వివరాలు ఇలా ఉండనున్నాయి.
Amazon Discount Offers: పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో ముందుకొస్తుంటాయి. అదే విధంగా రానున్న దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ పురస్కరించుకుని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్‌లో అద్భుతమైన, ఊహించని ఆఫర్లు లభించనున్నాయి. ఈ సేల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఆఫర్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పటి వరకు ఉంటుందనేది ఇంకా వెల్లడించలేదు. ప్రైమ్ సభ్యులకు సెప్టెంబర్ 26 రాత్రి నుంచే అందుబాటులో ఉండనుంది. సెప్టెంబర్ 27న ప్రారంభమై అక్టోబర్ నెలాఖరులో రానున్న దీపావళి వరకూ కొనసాగవచ్చని అంచనా. ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు వంటివాటిపై ఏకంగా 65 శాతం వరకూ డిస్కౌంట్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రముఖ కంపెనీలు ఎల్జీ, శాంసంగ్ వంటి బ్రాండ్లపై ఈ 65 శాతం డిస్కౌంట్ లభించవచ్చు. ఇక ఎల్జీ, శాంసంగ్, వోల్టాస్ కంపెనీ ఏసీలపై 55 శాతం తగ్గింపు లభించవచ్చు.
Whirlpool, Samsung, LG కంపెనీ రిఫ్రిజిరేటర్లపై 55 శాతం వరకూ తగ్గింపు లభించనుంది. మైక్రో ఓవెన్లపై కూడా 55 శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇక వివిధ బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు, యాక్సెసరీస్‌పై కూడా ఊహించని డిస్కౌంట్ లభించనుంది. ఐఫోన్ 13 అయితే కేవలం 39 వేలకే లభించనుంది. ఎంఆర్పీపై 10 వేల రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరో 2500 తగ్గుతుంది. కొనుగోలు చేసేటప్పుడు ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇతర ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో విక్రయాలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది.
Also read: CBSE Scholorship 2024: సింగిల్ గర్ల్ ఛైల్డ్ అయితే ఈ మెరిట్ స్కాలర్‌షిప్ మీ కోసమే. ఇలా అప్లై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.