Amazon hike Prime Plan Prices: ప్రైమ్ యూజర్లకు అమెజాన్ షాకిచ్చింది. ఇండియాలో ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు నేటి (డిసెంబర్ 13 సోమవారం) నుంచే అమలులోకి (Amazon Prime hiked prices) వచ్చాయి. ఇంతకు ముందుతో పోలిస్తే.. ప్రస్తుత ధరలు 50 శాతం వరకు అధికంగా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు ధరలు ఇలా..


దేశీయ యూజర్లకు వార్షిక సబ్​స్క్రిప్షన్​ ఇప్పటి వరకు (Amazon prime prices) రూ.999కు లభించింది. నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ రూ.129గా ఉంది. ఇక మూడు నెలల చందా రూ.329గా ఉండేది.


కొత్త ప్లాన్స్​ ఇవే..


అమెజాన్ ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ (Amazon price new plans)​ ఇప్పుడపు రూ.1,499కి పెరిగింది. అయితే ఈ ఒక్క రోజు (సోమవారం) మాత్రం స్పెషల్ ఆఫర్ కింద రూ.999కే ఇయర్లీ సబ్​స్క్రిప్షన్ ఇస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెబ్​సైట్లో పేర్కొంది. రేపటి నుంచి పెంచిన ధర అమలులోకి వస్తుందని తెలిపింది.


మంథ్లీ ప్లాన్​ రూ.179కి పెరిగింది. మూడు నెలల ప్లాన్​ రూ.459కి చేరింది.


ఆటో రెన్యువల్​ లేదు..


అయితే కొత్త ప్లాన్స్​ తీసుకొస్తున్న నేపథ్యంలో యూజర్లకు కీలక సూచనలు చేసింది అమెజాన్ ఇండియా. ఇప్పటికే ప్రైమ్​ వాడుతున్న వినియోగదారుల గడువు ముగిసి అకౌంట్​లో కార్డ్స్ సేవ్ (డెబిట్​, క్రెడిట్​ కార్డ్స్​)​ అయ్యి ఉన్నా.. సబ్​స్క్రిప్షన్​ ఆటో రెన్యువల్ అవదని స్పష్టం చేసింది. కొత్త ధరలతో సబ్​స్క్రిప్షన్ తీసుకోవాలా? వద్దా? అనేది.. పూర్తిగా యూజర్ల ఇష్టమేనని వివరించింది.


ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​తో ఉపయోగలేమిటి?


సాధారణ యూజర్లతో పోలిస్తే.. ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​ ఉన్న వినియోగదారులకు పలు వెసులుబాటులు అందిస్తుంటుంది (Amazon prime benefits) అమెజాన్. ముఖ్యంగా పండుగలు, ఇతర సమయాల్లో నిర్వహించే స్పషల్​ సేల్స్​​ విషయంలో ప్రైమ్ యూజర్లకు అధిక ప్రాధాన్యతనిస్తుంది. అంటే.. ఏదైనా సేల్ ప్రారంభిస్తే కనీసం ఒకరోజు ముందుగానే ప్రైమ్​ యూజర్లకు ఆ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.


సాధారణ యూజర్లకన్నా ప్రైమ్​ వినియోగదారులకు ఆర్డర్​ డెలివరీ వేగంగా ఉంటుంది. డెలివరీ ఛార్జీలు కూడా ఉండవు.


కొన్ని సార్లు కేవలం ప్రైమ్ యూజర్ల కోసమే సేల్​ కూడా నిర్వహిస్తుంటుంది అమెజాన్​. వీటన్నింటితో పాటు.. ప్రైమ్​ వీడియో యాప్​లో సినిమాలు, వెబ్ సిరీస్​లను స్ట్రీమ్​ చేసేందుకు వీలుంటుంది. ప్రైమ్ మ్యూజిక్, గేమింగ్ సేవలను కూడా వినియోగించుకోవచ్చు.


Also read: Flipkart Realme Festive Sale: రూ.200 కంటే తక్కువ ధరకే అందుబాటులోని స్మార్ట్ ఫోన్స్


Also read: Women employees: దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులున్న కంపెనీగా టీసీఎస్​


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook