Amazon Republic Day Sale 2022: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్​ ఇండియా నిర్వహిస్తున్న స్పెషల్ సేల్ 'గ్రేట్ రిపబ్లిక్​ డే సేల్​ 2022' నేటితో ముగియనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరి రోజు సేల్​లో భాగంగా.. మొబైల్​ ఫోన్లు, ల్యాప్టాప్​లు, ఎలక్ట్రానిక్స్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఈ ఆఫర్ల గురించి ఇప్పుడు (Amazon Republic Day offers) తెలుసుకుందాం.


యాపిల్ ఐఫోన్ ఎక్స్​ఆర్ (Apple iPhone XR)​


యాపిల్​ ఐఫోన్​లలో బెస్ట్​ సెల్లర్​లలో యాపిల్ ఐఫోన్ ఎక్స్​ఆర్​ కూడా (Amazon offer on Apple iPhone XR)​ ఒకటి. అమెజాన్​ సేల్​లో ఈ ఫోన్​ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్​ను రూ.34,999కి సొంతం చేసుకునే వీలుంది. అదే విధంగా 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ను రూ.40,999కి కొనొచ్చు.


ఈ ఫోన్​లు 6.1 అంగుళాల డిస్​ప్లే, 12 ఎంపీ రియర్​ కెమెరా, 7 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఏ12 బయోనిక్​ చిప్​సెట్ ఉన్నాయి.


ఐఫోన్ 12 (iPhone 12)


ఐఫోన్​ 12పై కూడా భారీ డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్​. 64 జీబీ, బ్లాక్​ కలర్ వేరియంట్ మొబైల్ ధరను రూ.52,999గా ఉంచింది. దీని అసలు ధఱ రూ.59,900 కావడం (Amazon offer on Apple iPhone 12) గమనార్హం.


ఇక ఇదే ఫోన్​ 128జీబీ వేరియంట్​ ధరను రూ.70,900 నుంచి రూ.61,999కి తగ్గించింది అమెజాన్​. ఈ వేరియంట్ బ్లాక్​, బ్లూ, గ్రీన్​, పర్పుల్​, వైట్​ కలర్స్​లో అందుబాటులో ఉంది.


శాంసంగ్​ గెలాక్సీ ఎస్​ 20 ఎఫ్​ఈ 5జీ


శాంసంగ్​ గెలాక్సీ ఎస్​20 ఎఫ్​ఈ డిస్కౌంట్ ధరను రూ.36,990గా నిర్ణయించింది అమెజాన్​. ఈ స్మార్ట్​ఫోన్​కు నో కాస్ట్​ ఈఎంఐ, బ్యాంక్​ ఆఫర్​, ఎక్స్ఛేంజ్ ఆఫర్​నుకూడా అందుబాటులో ఉంచింది.​


గెలాక్సీ ఎస్​ 20 ఎఫ్​ఈ 5జీలో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 865 ప్రాసెసర్ ఉంది. 8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందులో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్​ అందుబాటులో ఉంటుంది.


2020 యాపిల్​ మ్యాక్​బుక్​ ప్రో..


2020 యాపిల్​ మ్యాక్​బుక్​ ప్రో ఆఫర్​ ధరను రూ.1,27,990గా నిర్ణయించింది అమెజాన్​. యాపిల్​ ఎం1 చిప్​ ల్యాప్​టాప్​ ఈ ల్యాప్​టాప్ అందుబాటులో ఉంది. 13.3 అంగుళాల డిస్​ప్లే, 8 జీబీ ర్యామ్​, 512 జీబీ ఎస్​ఎస్​డీ స్టోరేజ్​ ఈ ల్యాప్​టాప్ వస్తుంది.


బ్యాటరీ లైఫ్​ 20 గంటలుగా కంపెనీ పేర్కొంది. ఈ ప్యాప్​టాప్ స్పేస్​గ్రే, సిల్వర్​ కలర్స్​లో అందుబాటులో ఉంది.


Also read: Stock Market today: స్టాక్ మార్కెట్లపై మూడో రోజూ బేర్ పంజా- 60 వేల దిగువకు సెన్సెక్స్​


Also read: Gold Price Today: బ్యాడ్ ‏న్యూస్: దేశంలో ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook