Amazon Summer Edition Sale: అమెజాన్ సమ్మర్ సేల్- ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై డిస్కౌట్లకు రేపే లాస్ట్ డేట్!
Amazon Summer Edition Sale: అమెజాన్ సమ్మర్ సేల్ ప్రారంభించింది. ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. మరి ఈ ఆపర్లకు ఆఖరి తేదీ ఎప్పుడు? డిస్కౌంట్లు ఎంత ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Amazon Summer Edition Sale: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ డిస్కౌంట్లతో ప్రకటించిన సమ్మర్ ఎడిషన్ సేల్ మూడో రోజూ కొనసాగుతోంది. ఈ నెల 3న ప్రారంభమైన ఈ సేల్.. రేపటితో ముగియనుంది. మరి ఈ స్పెషల్ సేల్‌లో వేటిపై భారీ తగ్గింపులు ఉన్నాయి? అదనపు డిస్కౌంట్ కోసం బ్యాంక్ ఆఫర్లు ఎలా ఉన్నాయి? అనే పూర్తి వవరాలను ఇప్పుడు చూద్దాం.
దాదాపు అన్ని రకాల వస్తువులపై ఈ సేల్‌లో డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. ముఖ్యంగా వేసవికాలం వచ్చిన నేపథ్యంలో ఏసీలు, ఫ్రిడ్జ్‌ల వంటి వాటిపై భారీగా 40-70 వరకు తగ్గింపు ప్రకటించింది.
ఇదే కాకుండా కోటక్ మహీంద్రా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ సేల్‌లో కొనుగోలు జరిపితే.. 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది.
కొన్ని క్రేజీ డీల్స్..
ఐఎఫ్బీ 2 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ ఒరిజినల్ ధర రూ.59,599గా ఉండగా.. ఈ స్పషల్ సేల్‌లో దానిని 24 శాతం తగ్గింపుతో రూ.44,999కే విక్రయిస్తోంది.
అదే కాకుండా బ్యాంక్ ఆఫర్ ద్వారా మరో పదిశాతం తగ్గింపు పొందొచ్చు. అంటే దీని విలువ రూ.4,499. దీనితో పాటు పాత ఏసీని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.5,050 వరకు తగ్గింపు పొందొచ్చని తెలిపింది అమెజాన్. ఈ లెక్కన అన్ని ఆఫర్లు కలిపితే దాదాపు రూ.35 వేలకే ఈ ప్రీమియం ఏసీని సొంతం చేసుకోవచ్చు.
హయర్ 258 లీటర్స్ 3 స్టార్ ఇన్వర్టర్ ఫ్రోస్ట్ ఫ్రీ డబుల్ డోస్ ఏసీపై రూ.20 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది అమెజాన్. ఈ ఆఫర్‌తో ఫిడ్జ్ దఱ రూ.30,700 నుంచి రూ.24,690కి చేరింది.
ఇదే కాకుండా.. బ్యాంక్ ఆఫర్ ద్వారా మరో 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. బ్యాంక్ ఆఫర కలిపితే ఈ ఫ్రిడ్జ్ ధర రూ.2,469 తగ్గి.. రూ.22,221 వద్దకు చేరుతుంది. ఆఫర్ ఇంకా ఐపోలేదు. పాత ఫ్రిడ్జ్‌ను ఎక్స్ఛేంజ్ ఇవ్వడం ద్వారా రూ.4,500 వరకు తగ్గింపు వర్తిస్తుందని అమెజాన్ ఆఫర్లో ఉంది. అంటే ఈ ఆఫర్ పూర్తిగా లభిస్తే.. ఫ్రిడ్జ్ ధర రూ.17,721 వద్దకు దిగొస్తుంది.
నోట్: ఈ ఆఫర్లన్ని అమెజాన్ వెబ్సైట్ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. ఈ ఆఫర్లను చూసి కొనుగోలు చేసే ముందు మరోసారి తనిఖీ చేయాలని సూచన. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది ఎక్స్ఛేంజ్ చేసే ప్రోడక్ట్ క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది.
Also read: Gold Price Today : పెరిగిన బంగారం ధరలు.. ఏయే నగరాల్లో ఎంత ధర ఉందంటే..
Also read: SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్- అలా చేస్తే ఖాతాలు డబ్బులు మాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook