Home loan EMI: నాలుగేళ్ల విరామం తరవాత ఈసారి కేంద్ర రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేటును పెంచనుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ముఖ్యంగా ఈ ప్రభావం హోమ్‌లోన్స్ ఈఎమ్ఐపై ప్రభావం పడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే నిత్యావసర వస్తు ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మరో షాక్ కలగనుంది. ఈసారి అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ భారీ షాక్ ఇవ్వనుంది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ నెల వడ్డీ రేటును పెంచుతూ ప్రకటన చేయవచ్చు. అమెరికా కేంద్ర బ్యాంకు ప్రముఖుడైన జోరోమ్ పావెల్ ఈ నెల వడ్డీ రేటు పెంచనున్నట్టు ప్రకటించారు. నాలుగేళ్ల తరువాత తొలిసారి వడ్డీరేటు పెంచడం.


అమెరికా కేంద్ర బ్యాంకులో నాలుగేళ్ల అనంతరం వస్తున్న ఈ మార్పు ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. అంటే భారతదేశ రిజర్వ్ బ్యాంకు సహా ప్రపంచంలోని అన్ని రిజర్వ్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయి. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేటు పెంచితే ఆ ప్రభావం నేరుగా హోమ్‌లోన్స్ ఈఎమ్ఐపై పడుతుంది. అంటే మీ నెలసరి ఈఎమ్ఐ కూడా పెరిగిపోనుంది.


2018 తరువాత తొలిసారి ఇదే పెరగడం


అమెరికా పార్లమెంట్‌లో పావెల్ ఈ ప్రకటన చేశారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఈ నెల నుంచి వడ్డీ రేటు పెంచుతుందని వెల్లడించారు. అమెరికాలో క్రమంగా పెరుగుతున్న ఆర్ధిక మాంద్యం, ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఈ చర్య తీసుకోవచ్చని ముందు నుంచే అంచనా ఉంది. గతంలో అంటే 2018లో ఒకసారి వడ్డీ రేటు పెంచింది. తిరిగి మళ్లీ ఇప్పుడే. అయితే వడ్డీ రేటు ఎంత త్వరగా పెంచనుందనే విషయాన్ని పావెల్ ధృవీకరించలేదు. మార్చ్ 15-16 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 


Also read: Realme Narzo 50: 16 వేల రూపాయల రియల్‌మి నార్జో ఫోన్..కేవలం 249 రూపాయలకే తీసుకోవచ్చు, ఎలాగంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook