Dusara, Diwali 2020 smartphones offers: న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగ వస్తోందంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై ఆఫర్లే ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి కంపెనీలు. అలాగే తాజాగా యాపిల్ ఇండియా సైతం తమ ఐఫోన్ ( Apple phones Diwali offers ) అమ్మకాలపై ఆఫర్స్ ప్రకటించింది. ఐఫోన్‌ 11ని ( Offers on iphone 11 ) కొనుగోలు చేసిన వారికి ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందించనున్నట్టు యాపిల్ స్పష్టంచేసింది. ప్రస్తుతం 64 GB ఇంటర్నల్‌ మెమొరీ కలిగిన ఐఫోన్‌ 11 ధర రూ.68,300 గా ఉండగా, 128 GB మెమొరీ కలిగిన ఐఫోన్ ధర రూ.73,600 పలుకుతోంది. 256 GB ఇంటర్నల్ మెమొరీ వేరియెంట్ ఐఫోన్ 11 ధర రూ.84,100 కి లభిస్తోంది. Also read : SAMSUNG GALAXY F41 price, features: 17 వేలకే 64 MP కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ ఎయిర్‌పాడ్స్ ( Apple airpods offers ) విషయానికొస్తే.. చార్జింగ్ కేస్‌తో వచ్చే ఎయిర్‌పాడ్స్ ఖరీదు రూ.14,900 కాగా, వైర్‌లెస్ చార్జింగ్ కేస్‌తో లభించే ఎయిర్‌పాడ్స్ ఖరీదు రూ.18,900 గా ఉంది. ఇక ఎయిర్‌పాడ్స్ ప్రో కోసమైతే ఏకంగా రూ.24,900 వెచ్చించాల్సిందే. 


ఐఫోన్ 11 మొబైల్‌పై ఈ నెల 17 నుంచి దీపావళి వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని యాపిల్ ఇండియా తమ ఆన్‌లైన్ స్టోర్ హోమ్‌పేజీపై వెల్లడించింది. Also read : Jobs, Salary increments: వాళ్ల ఉద్యోగాలకు ఢోకా లేదట.. జీతాలు కూడా పెరుగుతాయి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe