APPLE iphone 13: నెలకు కేవలం రూ.2341కే ఐఫోన్ 13.. బై బ్యాక్ ఆఫర్ కూడా.. ఐసీఐసీఐ అద్భుత ఆఫర్..
APPLE iphone 13 ICICI Offer: యాపిల్ ఐఫోన్ కొనుగోళ్లపై ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ నో కాస్ట్ ఈఎంఐ అందిస్తోంది. అంతేకాదు, 25 శాతం బై బ్యాక్, రూ.5 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.
APPLE iphone 13 ICICI Offer: యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఐసీఐసీఐ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది.'బై నౌ.. పే ల్యాటర్..' కింద నో ఎక్స్‌ట్రా కాస్ట్ ఈఎంఐ అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా నెలకు రూ.2341 చెల్లిస్తే చాలు ఐఫోన్ 13ని మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, 25 శాతం బై బ్యాక్ ఆఫర్‌ని పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 25 వరకు ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
బై బ్యాక్, క్యాష్ బ్యాక్ ఆఫర్ :
ప్రస్తుతం యాపిల్ స్టోర్స్‌లో ఐఫోన్ 13 సాధారణ ధర రూ.69,900గా ఉంది. ఐసీఐసీఐ ఇందులో 75 శాతం మొత్తాన్ని 24 ఈఎంఐలుగా కన్వర్ట్ చేసింది. మిగతా 25 శాతాన్ని (రూ.17,475) 24 ఈఎంఐలు పూర్తయ్యాక చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.52,425 మొత్తాన్ని 24 ఈఎంఐలలో చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ధర రూ.69,900పై ఏడాదికి 7.5 శాతం వడ్డీ రేటు ఉంటుంది.ఈ స్కీమ్ కోసం ఐసీఐసీఐ సర్విఫైతో టైప్ అయింది. తద్వారా 25 శాతం బై బ్యాక్ ఆఫర్‌ను అందిస్తోంది. అంతేకాదు, రూ.5591 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఫోన్ ఈఎంఐ ముగిసేలోపు బై బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన కొన్ని యాపిల్ రీసెల్లర్ స్టోర్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ 13 మాత్రమే కాదు.. ఇంకా చాలా మోడల్స్‌పై :
'బై నౌ.. పే ల్యాటర్..' కింద ఐఫోన్ 13 మాత్రమే కాదు ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 11, ఐఫోన్ 12 కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన యాపిల్ స్టోర్స్‌లో వీటిని కొనుగోలు చేశాక బై బ్యాక్ ఆఫర్ కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ స్టోర్ సిబ్బంది చేస్తారు.నమోదు చేసిన ఐదు బిజినెస్ రోజుల్లో ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. దానికి సంబంధించిన ధ్రువీకరణ ఎస్ఎంఎస్ రూపంలో మీకు అందుతుంది.
Also Read: Hyderabad Rape: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్.. హైదరాబాద్ లో మరో దారుణం
Also Read: Nirjala Ekadashi 2022: నిర్జల ఏకాదశి ఎప్పుడు? ఆ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook