Hyderabad Rape: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి రోజంతా తిప్పిన క్యాబ్‌ డ్రైవర్‌.. హైదరాబాద్ లో మరో దారుణం

Hyderabad Rape: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం స్పష్టిస్తోంది. ఈ ఘటనలో నిందితులంతా ఇంకా పట్టుబడలేదు. గ్యాంగ్ రేప్ ఘటన  హైదరాబాద్ పోలీసుల ప్రతిష్టకు మచ్చగా మారింది. ఈ కేసు దుమారం కొనసాగుతుండగానే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది.

Written by - Srisailam | Last Updated : Jun 5, 2022, 12:04 PM IST
  • హైదరాబాద్ లో మరో దారుణం
  • మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్
  • మరుసటి రోజు వదిలిపెట్టిన డ్రైవర్
Hyderabad Rape: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి రోజంతా తిప్పిన క్యాబ్‌ డ్రైవర్‌.. హైదరాబాద్ లో మరో దారుణం

Hyderabad Rape: జూబ్లీహిల్స్ లోని పబ్ కు వచ్చిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం స్పష్టిస్తోంది. ఈ ఘటనలో నిందితులంతా ఇంకా పట్టుబడలేదు. గ్యాంగ్ రేప్ ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. హైదరాబాద్ పోలీసుల ప్రతిష్టకు మచ్చగా మారింది. ఈ కేసు దుమారం కొనసాగుతుండగానే హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. మైనర్‌ బాలికను క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.  మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

కేసు వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం సుల్తాన్‌షాహీ ప్రాంతంలో ఓ మైనర్ బాలిక నడుచుకుంటూ వెళ్తుండగా.. లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ ఆమె దగ్గరికి వచ్చాడు. ఇంటికి తీసుకువెళ్తానంటూ బాలికకు మాట మాటలు చెప్పాడు. క్యాబ్ డ్రైవర్ మాటలు నమ్మిన బాలిక... అతనితో పాటు క్యాబ్ లో వెళ్లింది. అయితే బాలికను ఇంటికి తీసుకువెళ్లకుండా హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రాత్రి అయినా తమ కూతురు రాకపోవడంతో కంగారు పడిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే మరుసటి రోజు బాలికను తీసుకొచ్చి సుల్తాన్‌షాహీలో వదిలిపెట్టాడు క్యాబ్ డ్రైవర్. ఇంటికి వచ్చిన బాలికను పోలీసులు విచారించగా.. లుక్మాన్ అనే క్యాబ్ డ్రైవర్ తనను తీసుకెళ్లాడని చెప్పింది. బాలిక చెప్పిన వివరాలతో మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చారు పోలీసులు. క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ తో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. క్యాబ్ డ్రైవర్ మైనర్ బాలికను ఎక్కడికి తీసుకెళ్లాడు.. రోజంతా ఎక్కడ ఉన్నారు అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొందుర్గ్‌ ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ ఎవరి ఇంట్లో ఉన్నారన్నది మొఘల్‌పురా పోలీసులు ఆరా తీస్తున్నారు. లుక్మాన్ తో పాటు మైనర్ బాలికకు కొందుర్గులో ఆశ్రయం ఇచ్చిన వారిని పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసు వివరాలను పోలీసులు బయటికి పొక్కనీయడం లేదు. 

READ ALSO: Chintamaneni Prabhaker: టీడీపీ నేత చింతమనేని హత్యకు షూటర్? ప్లాన్ చేసింది ఎవరంటే..?  

READ ALSO: Covid 19 Cases Updates: దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసుల సంఖ్య.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News