Apple iPhone 13 Price only Rs 53,850 in Flipkart: మీరు యాపిల్ ఐఫోన్ 13 మొబైల్ కొనాలని ప్లాన్‌ చేసుకుంటున్నారా?. అయితే ఇంతమంచి సమయం పొతే మళ్లీరాదు. ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 13 ధర ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ధర రూ.74,850లుగా ఉంది. దీని అసలు ధర రూ. 79,900లుగా ఉండగా.. 6 శాతం తగ్గింది. ఐఫోన్ 13 గత సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫోన్ కొనుగోలు కోసం మొబైల్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్ ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్సేఛేంజ్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. మీ పాత ఫోన్‌ను విక్రయించడం ద్వారా గరిష్టంగా రూ. 16,000లను పొందవచ్చు. ఫోన్‌పై ఎటువంటి డెంట్లు, గీతలు లేదా ఇతర భౌతిక లోపాలు లేనట్లయితేనే 16 వేలు పొందవచ్చు. అప్పుడు రూ. 58,850లకే  ఐఫోన్ 13 మీ సొంతమవుతుంది. మీ పాత ఫోన్‌ను ఎక్సేఛేంజ్‌ చేయడం ద్వారా కేవలం ఐఫోన్ 13 మాత్రమే కాకుండా.. ఏదైనా మొబైల్ మీరు కొనుకోవచ్చు. 


యాపిల్ ఐఫోన్ 13 ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,850. పాత ఫోన్‌ను ఎక్సేఛేంజ్‌ చేస్తే.. రూ. 16,000 తగ్గుతుంది. అప్పుడు ఐఫోన్ 13 ధర రూ. 58,850కి తగ్గుతుంది. ఇంకా HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు  ఈ ఫోన్‌పై రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు. దాంతో రూ. 53,850లకి అందుబాటులోకి వస్తుంది. మరోవైపు అమెజాన్ ఇండియా ఐఫోన్ 13ను ఎక్సేఛేంజ్‌ ఆఫర్ ద్వారా (రూ. 11,050) రూ. 63,850కి అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్ లేదు. 


ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు:
# 6.1 ఓఎల్ఈడీ డిస్‌ప్లే (హెచ్‌డీఆర్ సపోర్ట్, సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్)
# ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌ (ఐఓఎస్ 15.4 ఆపరేటింగ్ సిస్టమ్‌)
# బ్యాక్ కెమెరాలో 12, 12 మెగాపిక్సెల్
# సెల్ఫీ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
# 5జీ, 4జీ ఎల్‌టీఈ
# ఫిజికల్ సిమ్, మరో ఈ-సిమ్, 
# లైటెనింగ్ పోర్ట్ 
# కనెక్టివిటీ ఫీచర్లు
# 3240 ఎంఏఎచ్ బ్యాటరీ
# స్టార్‌లైట్, మిడ్‌నైట్, బ్లూ, పింక్, రెడ్, గ్రీన్ కలర్స్ 


Also Read: 164, 162 కిమీ వేగంతో బంతులు వేశా.. కానీ బౌలింగ్ మెషీన్ పనిచేయలేదు: సమీ


Also Read: Ketika Sharma Post: నేను సెక్సీగా ఉన్నానా లేదా.. యువ హీరోయిన్ అలా అడిగేసిందేందబ్బా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook