Cheque Rule: బ్యాంకుల చెక్ విషయంలో చాలా జగ్ర్తటగా ఉండాలి.. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చిన తరువాత వాళ్లు బ్యాంక్ కు వెళ్లి క్లియరెన్స్ చేసుకునేపుడు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోతే అటు చెక్ తీసుకున్న వ్యక్తి, ఇటు చెక్ ఇచ్చిన వ్యక్తి ఇద్దరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. చెక్ బౌన్స్ అయితే మీ సిబిల్ స్కోర్ (CIBIL Score) ప్రభావితం అవ్వటమే కాకుండా, చెక్ బౌన్స్ చార్జీలు (Check Bounce charge) కూడా మీరు చెల్లించాల్సి వస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకవేళ మీరు మీ అధిక లావాదేవీలను చెక్ రూపంలో చెల్లిస్తే మాత్రం ఆర్‌బిఐ (RBI) తీసుకొచ్చిన కొత్త నిబంధనలను (RBI new Rules) దృష్టిలో పెట్టుకోవాల్సిందే.. లేకపోతే అన్ని విధాలా నష్ట పోయే అవకాశం ఉంది. 


Aslo Read: Dengue: ఓవైపు కరోనా కల్లోలం.. మరోవైపు డెంగ్యూ డేంజర్ బెల్స్..ఏపీలో విపత్కర పరిస్థితులు


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (reserve bank of india) చెక్ వాడకాల విషయంలో కొత్త నిబంధనలు అమలుచేసిందన్న విషయం మన అందరికి విదితమే.. ఈ నిబంధనల ప్రకారం, శని ఆదివారాల్లో కూడా చెక్ క్లియరెన్స్ (check clearance on Sunday, Saturday) జరగవచ్చు. ఇది వరకు చెక్ క్లియరెన్స్ కు కేవలం బ్యాంక్ పనిచేసే రోజుల్లో మాత్రమే ఉండేవి. ఇది మార్చిన ఆర్‌బిఐ వారం చివరి రెండు రోజుల్లో కూడా చెక్ క్లియరెన్స్ జరుగుతాయని స్పష్టం చేసింది. 


కావున చెక్ ఇచ్చే ప్రతి ఒక్కరు బ్యాంక్ సెలవు రోజులలో కూడా ఖాతాలలో ఖచ్చితంగా డబ్బు ఉండేలా చూసుకోవాలి. కావున ఎవరికైనా లావాదేవీల కోసం చెక్ ఇచ్చే ముందే మీ బ్యాంక్ అకౌంట్లో సరిపడా మొత్తం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ లేని ఎడల చెక్ బౌన్స్ (Check Bounce)అయ్యే ప్రమాదం ఉంది మరియు ఫైన్ కట్టే ప్రమాదం కూడా ఉంది. 


ఈ నిబంధనలు అన్ని బ్యాంకులు పాటించాలని 24 గంటలు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ  వెల్లడించింది. ఈ నిబంధనలు ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకుల‌కు కూడా వర్తిస్తాయని, ఈ నెల ప్రారంభం నుంచి ఎన్ఏసీహెచ్ సేవలను అందుబాటులో ఆర్‌బీఐ ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. 


Aslo Read: Apple: సిమ్ లేకుండానే కాలింగ్, ఇంటర్నెట్ సేవలు.. సరికొత్త టెక్నాలజీతో ఆపిల్!


కావున చెక్ ల ద్వారా లావాదేవీలను కొనసాగించే వారు బ్యాంక్ పని రోజుల్లో మాత్రమే కాకుండా శని, ఆదివారాల్లో ఖాతాలో డబ్బులు నిల్వ ఉంచితే ఎలాంటి సమస్యలు ఉండవు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook