Ather 450s Price: ఏథర్ 450s ఎలక్ట్రిక్ బైక్ లాంచింగ్ అప్పుడే..ప్రారంభమైన ప్రీ బుకింగ్స్, ధర ఎంతో తెలుసా?
Ather 450s Price: ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ ఏథర్ 450Sని స్మార్ట్ బైక్ త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. అయితే ఈ ఏథర్ 450Sని ఎలా బుక్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Ather 450s Price: ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ ఏథర్ ఎనర్జీ త్వరలో మార్కెట్‌లోకి మరో బైక్‌ను విడుదల చేయబోతోంది. ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ 450Sని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంక ముందు విడుదల చేసిన ఎలక్ట్రిక్ బైక్ కంటే చాలా రకాల కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నట్లు కంపెనీ అధికారికంగా పేర్కొంది. ఈ Ather 450S ప్రారంభ ధర రూ. 129,999 (ఎక్స్-షోరూమ్) ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 115 కి.మీల రేంజ్ మైలేజీని ఇస్తుందని ఏథర్ ఎనర్జీ తెలిపింది. ఈ స్కూటర్‌లో 3kWh బ్యాటరీ కలిగి ఉంటుంది.
ఏథర్ 450Sని ఎలా బుక్ చేయాలో తెలుసా?
ఏథర్ 450S కొనుగోలు చేయాలనుకునేవారు మీ దగ్గరలో ఉన్న Ather అధికారిక స్టోర్ వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు అధికారిక వెబ్ సైట్‌కి వెళ్లి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మనీకంట్రోల్ వెబ్‌సైట్ సూచించిన వివరాల ప్రకారం..ఏథర్ 450Sని మార్కెట్లోకి విడుదల చేయక ముందే ప్రీ బుకింగ్స్ ద్వారా కొనుగోలు చేయోచ్చని అథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా తెలిపారు. ఈ బైక్ ఆధునాత ఫీచర్లను కలిగి ఉంటుందని..కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నాణ్యమైనదిగా అందించేందు కృషి చేస్తామన్నారు.
ఏథర్ 450S ధర:
FAME II సబ్సిడీలో మార్పు కారణంగా ఏథర్ ఉత్పత్తుల ధరల్లో తీవ్ర మార్పులు తీసుకువచ్చింది. సబ్సిడీల్లో మార్పుల కారణంగా ఏథర్ కంపెనీతో పాటు Ola, TVS, BAJAJ ఎలక్ట్రిక్ బైక్‌లు కూడా భారీగా ధరలు పెంచినట్లు సమాచారం. ఏథర్ 450S ధర విషయానికొస్తే.. రూ. 129,999 ఎక్స్-షోరూమ్ ధరతో వినియోగదారులకు లభించబోతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook