Bank Strike Today: నేటి నుంచి రెండు రోజులు బ్యాంకుల సమ్మె- కారణాలివే..
Bank Strike Today: యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి.
Bank Strike Today: ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండు రోజుల సమ్మె చేపట్టనున్నాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు డిసెంబర్ 16 (గురువారం), డిసెంబర్ 17 (శుక్రవారం) దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇందులో పాల్గొనున్నాయి.
సమ్మెకు కారణాలు?
ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో రెండింటిని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రైవేటీకరించాలని ప్రభుత్వం బడ్జెట్ 2021-22లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ సంఘాలు సమ్మె (Banks Strike) చేపట్టనున్నాయి.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) ఈ మేరకు సమ్మెకు (UFBU calld for Banks Strike) పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి ఈ నెల ఆరంభంలోనే నోటీసులు కూడా ఇచ్చాయి బ్యాంక్ యూనియన్లు. ప్రైవేటుకు.. బ్యాంకులను అప్పగించడం వల్ల బలహీన వర్గాలకు రుణాల లభ్యత తగ్గుతుందని.. కోట్లాది మంది డిపాజిట్లు రిస్క్‌లో పడతాయని బ్యాంకింగ్ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
చర్చలు విఫలం..
సమ్మె నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అదనపు చీఫ్ కమిషనర్ తమతో చర్చలు జరిపినట్లు యూఎఫ్‌బీయూ తెలిపింది. అయితే ఆ చర్చలు విఫలమైనందువల్లే సమ్మెకు సిద్ధమైనట్లు పేర్కొంది.
ఈ కార్యకలాపాలపై ప్రభావం..
సమ్మె కారణంగా నగదు బదిలీ, చెక్ క్లియరెన్స్ సహా ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.
Also read: Women employees: దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులున్న కంపెనీగా టీసీఎస్
Also read: Edible oil prices: మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు!- కారణాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook