best camera phones of 2022 xiaomi mix 5 and vivo nex 5 will be best camera phones this year : ప్రస్తుతం తక్కువ బడ్జెట్‌లో కూడా చాలా స్మార్ట్‌ ఫోన్లు టాప్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌లతో వస్తున్నాయి. దీంతో ఈ ఏడాది.. గతేడాది మాదిరిగా స్మార్ట్‌ ఫోన్స్‌ (Smart phones) మధ్య ఫ్లాగ్‌షిప్ (Flagship) విషయంలో పెద్దగా పోటీ ఉండదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షావోమి (Xiaomi) రెడ్‌మీ కే40 (Redmi K40) సిరీస్‌ను క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగ్‌ 870 (Qualcomm Snapdragon 870), స్నాప్‌డ్రాగ్‌ 888 (Snapdragon 888) ప్రాసెసర్‌లతో మార్కెట్‌లోకి వదిలింది. 


అలాగే రియల్‌మి (Realme) రియల్‌మి జీటీని (Realme GT) స్నాప్‌డ్రాగన్ 888తో, రియల్‌మి జీటీ 2 ప్రోను స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 1తో లాంచ్ చేసింది. ఇలా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు (Smart phones) మార్కెట్‌లోకి చాలానే వచ్చాయి. దీంతో ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్ల కంపెనీలు ఫోటో, (Photo) వీడియో నాణ్యతపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.


షావోమి, (Xiaomi) వీవో (Vivo) కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్లు అయిన Xiaomi Mi 11 Ultra, Vivo X70 Pro ప్లస్‌లలో ఎక్కువ క్వాలిటీ ఉన్న కెమెరాలను ఇచ్చాయి.


ఇక 2022లో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు (Smartphone companies) షావోమి, (Xiaomi) వీవో (Vivo) కంపెనీలు ఎక్స్‌లెంట్‌ ఫోటోగ్రఫీ తీసే విధంగా ఉండే కెమెరా ఫోన్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దీంతో షావోమి, వీవోలు మరోసారి ట్రెండ్‌సెట్టర్‌గా మారబోతున్నాయి. షావోమి మిక్స్‌ 5 (Xiaomi MIX 5) అలాగే వీవో నెక్స్‌ 5 (Vivo NEX 5) స్మార్ట్‌ ఫోన్స్‌ అదిరిపోయే కెమెరా క్వాలిటీతో రానున్నాయి. 2022లో బెస్ట్ కెమెరా ఫోన్స్‌గా (Best Camera Phones‌) ఇవి నిలవనున్నాయి.


ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లలో కెమెరా ఫీచర్స్‌ కూడా చాలా ఉండనున్నాయి. అల్ట్రా-వైడ్, నార్మల్, టెలిఫోటో లెన్స్‌తో ఫోటో, వీడియో తీసే సమయంలో లైటింగ్‌ తక్కువగా ఉన్నా కూడా క్వాలిటీ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇక తమ ఫోన్లలో మంచి క్వాలిటీ ఉన్న కెమెరాలను (Quality camera) ఇచ్చేందుకు.. షావోమి (Xiaomi) లైకాతో, వీవీ (Vivo) జైస్‌ వంటి హై ప్రొఫైల్ కెమెరా దిగ్గజాలతో కొలాబ్రేట్‌ కానున్నట్లు సమాచారం.


Also Read : Money Lines on Palm: అరచేతిలో ఈ గీతలుంటే.. డబ్బే డబ్బు.. పట్టిందల్లా బంగారమేనట


ఇక షావోమి మిక్స్‌ 5 (Xiaomi MIX 5) వీవో నెక్స్‌ 5 (Vivo NEX 5) ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్నాయి. ఎక్కువ సేపు వినియోగించే విధంగా వీటి బ్యాటరీని రూపొందిస్తున్నారు. ఈ రెండు ఫోన్‌లు 2022లో అత్యుత్తమ కెమెరా ఫోన్‌లుగా నిలవనున్నాయని టాక్. ఇక ఈ రెండు స్మార్ట్‌ ఫోన్ల (smart‌ phones) ఫ్లాగ్‌షిప్‌ల గురించి, వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.


Also Read : Rose Water Health Benifits : రోజ్ వాటర్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook