Best Cars In India: రూ.8 లక్షలోపు బెస్ట్ కార్లు ఇవే.. ఎగబడి కొంటున్న జనాలు..!
Best Cars In India Under 8 Lakhs: కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్‌లో తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామీలీస్ కోసం సరికొత్త మోడల్స్‌ను తీసుకువస్తున్నాయి. రూ.8 లక్షలలో బెస్ట్ కార్లను ఓసారి చూసేయండి.
Best Cars In India Under 8 Lakhs: ప్రస్తుతం మార్కెట్‌లో కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కార్ల కోసం చూస్తున్నారు. మార్కెట్‌లో తక్కువ బడ్జెట్‌లో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి. మీరు రూ.8 లక్షల కంటే తక్కువ ధరలో కారు కోసం చూస్తున్నారా..? అయితే ఇక్కడ ఓ లుక్కేయండి. స్కోడా Kylaq రీఎసెంట్‌గా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7.89 లక్షలుగా ఉంది. డిజైన్ పరంగా ఈ కారు సిగ్నేచర్ స్టైలింగ్‌తో బోల్డ్ గ్రిల్, స్ప్లిట్ LED హెడ్‌లైట్‌లతో ఉంది. ఈ కారు చూసేందుకు కుషాక్‌లాగా కనిపిస్తుంది. ఆలివ్ గోల్డ్ కలర్‌లో మోడల్‌ను తీసుకువచ్చారు.
స్కోడా MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును డిజైన్ చేశారు. యాపిల్ CarPlay, Android Autoతో కూడిన 10.0-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక AC వెంట్‌లతో సహా ఫీచర్లను ఇచ్చారు. సింగిల్-పేన్ సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెథెరెట్ అప్‌హోల్‌స్టరీ వంటి అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్‌లో రిలీజ్ చేశారు. సెక్యూరిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ISOFIX మౌంట్‌లు, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు అన్ని వేరియంట్‌లలో స్టాండర్డ్‌గా ఇచ్చారు. ఒక స్టాండ్‌అవుట్ ఫీచర్ డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ ఇద్దరికీ పవర్డ్ సీటు ఫెసిలిటీ ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే.. Kylaq 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో 115 hp, 178 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ అనే రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. SUV 10.5 సెకన్లలో 0-100 kmph వేగం స్పీడ్ అందుకుంటుంది.
మరో కారు ఇది..
Turbo Petrol CVT Visia వేరియంట్‌ల ధర రూ.5,99,400 నుంచి మొదలై రూ.9,00,59,500 వరకు లభిస్తుంది. Visia+ వేరియంట్ ధర రూ.6,49,400 నుంచి లభిస్తుంది. అసెంటా వేరియంట్‌ల ధర రూ.7,14,000 నుంచి రూ.9,79,000 వరకు అందుబాటులో ఉంటుంది. N-Connecta వేరియంట్ ధర రూ.7,86,000 నుంచి మొదలై రూ.10,34,000 వరకు ఉంటుంది. Tekna వేరియంట్‌ల ధర రూ.8,75,000 నుంచి మొదలై రూ.11,14,000 వరకు ఉంటుంది.
Tekna+ వేరియంట్ విషయానికి వస్తే.. రూ.9,10,000 నుంచి రూ.11,50,000 వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 1.0-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ కొత్త మాగ్నైట్‌లో డిజైన్ చేశారు. 71 hp పవర్‌ను, 96 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని రెండవ ఇంజన్ ఆప్షన్‌లో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్, 99 hp పవర్‌ను, 160 Nm వరకు టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT, CVT అందుబాటులో ఉంది. ఇక సెక్యురిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. 6 ఎయిర్‌బ్యాగ్‌ల సెటప్, EBDతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)ని జత చేశారు.
Also Read: KT Rama Rao: ఏసీబీ విచారణపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 82 ప్రశ్నలు అడిగి సంపిండ్రు
Also Read: Beer Supply: బీర్ విక్రయాల బంద్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన! బీర్‌లు ఉంటాయా.. లేవా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.