KT Rama Rao ACB Investigation: తీవ్ర ఉత్కంఠ రేపిన ఏసీబీ విచారణ కేసులో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నవ్వుతూ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కేటీఆర్ విచారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేసు లేదు.. లొట్టపీసు లేదు' మరోసారి చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అక్రమ కేసులు నమోదు చేస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి లేనప్పుడు ఏముంటదని తెలిపారు.
Also Read: KT Rama Rao: 'అది లొట్టపీసు కేసు.. రేవంత్ రెడ్డి ఒక లొట్టపీసు సీఎం'.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏసీబీ కార్యాలయంలో విచారణ అనంతరం నేరుగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు కేటీఆర్ చేరుకున్నారు. అంతకుముందు అక్కడ మీడియాతో మాట్లాడుతుంటే పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రెస్‌మీట్ నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన కేటీఆర్‌ను బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భుజాలపైన ఎత్తుకుని కార్యాలయంలోకి తీసుకెళ్లారు. కేటీఆర్ రాకతో పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.
Also Read: Beer Supply: బీర్ విక్రయాల బంద్‌పై ప్రభుత్వం సంచలన ప్రకటన! బీర్‌లు ఉంటాయా.. లేవా?
విలేకరుల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'విచారణలో నన్ను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఈ కేసులో అవినీతి ఎక్కడుంది అని అధికారులను అడిగాను.. దీంతో అధికారులు ఇబ్బందులు పడ్డారు' అని కేటీఆర్ వివరించారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్లు.. రేవంత్ రెడ్డికి అందరూ దొంగలుగానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. 'నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు' అని మరోసారి స్పష్టం చేశారు. 'జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కి వస్తా.. ఓపెన్‌గా కెమెరా పెట్టు.. ఈ కేసుపై చర్చిద్దాం. కావాలంటే లై డిటెక్టర్ పెట్టు' అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. 'నేను మాట్లాడుతా.. నువ్వు మాట్లాడు. ఎవడు దొంగనో.. ఎవడు దొరనో ప్రజలు అందరూ చూస్తారు. తేల్చుకుందాం!' అని చెప్పారు.
ఇదో లొట్టపీసు కేసు అని కేటీఆర్ కొట్టిపారేశారు. 'అధికారులు అడిగిన ప్రశ్ననే మళ్లీ మళ్లీ అడిగారు. మొత్తం 82 ప్రశ్నలు వేశారు. మళ్లీ ఎప్పుడు రావాలనేది చెప్పలేదు. ఒకవేళ చెప్తే మళ్లీ వెళ్తా' అని కేటీఆర్ ప్రకటించారు. 'దొంగ కేసులు.. లొట్టపీసు కేసులు నిలవవు' అని పేర్కొన్నారు. 'రేవంత్ రెడ్డికి అవగాహన.. పరిమితమైన జ్ఞానంతో ఇందులో ఏదో కుంభకోణం జరిగింది అని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నింట్లో కూడా దొంగతనం జరుగుతది. అన్నింట్లో పైసలు తింటరనే దిక్కుమాలిన ఆలోచన ఉంటది' అని విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.