Maruti Eeco 7 Seater Car @ Rs 5.25 Lakhs: ఇండియన్ కార్ మార్కెట్‌లో 7 సీటర్ కార్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఎస్‌యూవీ కార్లకున్నట్టే 7 సీటర్ కార్లకు మోజు పెరుగుతోంది. మార్చ్ నెల కార్ల విక్రయాల్లో మారుతి మరోసారి తన ఆధిపత్యం కొనసాగించింది. 7 సీటర్ కార్ల విక్రయాల్లో మారుతి ఈకో మొదటి స్థానంలో నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా 7 సీటర్ కార్ల గురించి మాట్లాడుకుంటే మారుతి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా పేర్లు గుర్తొస్తాయి. ఎందుకంటే దేశంలో 7 సీటర్ కార్లలో ఈ రెండింటినీ క్రేజ్ ఎక్కువ. అయితే మార్చ్ నెల విక్రయాల్లో ఈ రెండు కార్లు వెనక్కి పడిపోయాయి. ఈ రెండు కార్ల కంటే తక్కువ ధరకు లభిస్తోన్న మారుతి కంపెనీకు చెందిన మరో కారు మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ కారు ధర కేవలం 5.26 లక్షలే. దీనికితోడు మైలేజ్ కూడా అద్భుతంగా వస్తోంది. 


7 సీటర్ కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఈకో మోడల్ మార్చ్ నెలలో అత్యధికంగా విక్రయమైంది. 2023 మార్చ్ నెలలో ఈకో మోడల్ కారు..విక్రయాల్లో మారుతి ఎర్టిగా, టొయోటా ఇన్నోవాలను వెనక్కి నెట్టేసింది. ఈకోకు హఠాత్తుగా ఆదరణ పెరగడానికి కారణం మైలేజ్, ఎకానమీ ధర. మారుతి సుజుకి మార్చ్ 2023లో తన విక్రయాల్ని వెల్లడించింది. ఇందులో ఈకో 11,995 యూనిట్లు విక్రయమయ్యాయి. ఓవరాల్ కార్ల విక్రయాల్లో 8వ స్థానంలో ఉంది. దేశంలో రెండవ బెస్ట్ సెల్లింగ్ 7 సీట్ కారు ఎర్టిగా. మార్చ్ నెలలో ఈ కారు 9,028 యూనిట్లు సేల్ అయ్యాయి. ఆ తరవాత స్థానం టొయోటా ఇన్నోవా దక్కించుకుంది. మార్చ్ నెలలో 8,075 యూనిట్లు అమ్ముడయ్యాయి. 


మారుతి ఈకో ధర, ప్రత్యేకతలు ఇవే


మారుతి ఈకో ధర 5.26 లక్షల నుంచి ప్రారభమై..6.53 లక్షల వరకూ ఉంటుంది. మారుతి ఈకోలో నాలుగు వేరియంట్లు న్నాయి. అవి వరుసగా ఫైవ్ సీటర్ స్టాండర్డ్, ఫైవ్ సీటర్ ఏసీ, ఫైవ్ సీటర్ ఏసీ సీఎన్జీ, 7 సీటర్ స్టాండర్డ్. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ పవర్‌తో ఉంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్‌తో ఉంది. ఇక ఫీచర్లు పరిశీలిస్తే..ఇందులో ఒక డిజిటల్  స్పీడో మీడర్, ఏసీ కోసం రోటరీ డయల్, రిక్లైనింగ్ ఫ్రండ్ సీట్లు, మేన్యువల్ ఏసీ, 12వి ఛార్జింగ్ సాకెట్ ఉంటాయి. సేప్ఠీ కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ , ఈబీడీ విత్ ఏబీఎస్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్, రేర్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి.


Also Read: Shaakuntalam Review: సమంత శాకుంతలం రివ్యూ.. విజువల్ ట్రీటే కానీ?


మార్చ్ నెలలో టాప్ 10 కార్ల విక్రయాలు


1. మారుతి సుజుకి స్విఫ్ట్                           17,559 యూనిట్లు
2. మారుతి సుజుకి వేగన్ ఆర్                    17,305 యూనిట్లు
3. మారుతి సుజుకి బ్రెజా                           16,227 యూనిట్లు
4. మారుతి సుజుకి బలేనో                         16,168 యూనిట్లు
5. టాటా నెక్సాన్                                       14,769 యూనిట్లు
6. హ్యుండయ్ క్రెటా                                 14,026 యూనిట్లు
7. మారుతి సుజుకి డిజైర్                           13,394 యూనిట్లు
8. మారుతి సుజుకి ఈకో                             11,995 యూనిట్లు
9. టాటా పంచ్                                         10,894 యూనిట్లు
10. మారుతి సుజుకి గ్రాండ్ విటారా             10,045 యూనిట్లు


Also Read: Twitter Merger News: మూడో కంటికి తెలియకుండా విలీనం చేసిన ఎలాన్ మస్క్, ట్విట్టర్ కధ ముగిసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook