Biggest IPO: మార్కెట్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్న బాహుబలి ఐపీవో.. ఎల్ఐసీ రికార్డు గోవిందా
New IPO: భారత స్టాక్ మార్కెట్లోకి అతిపెద్ద ఐపీఓ ఎంట్రీ ఇవ్వబోతోంది. అక్టోబర్ లో మార్కెట్లోకి లాంచ్ కానుంది. హ్యుందాయ్ రాకతో ఎల్ఐసీ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద ఐపీఓ కానుంది.
Hyundai India IPO: భారత్ స్టాక్ మార్కెట్లోకి అతిపెద్ద ఐపీఓ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 25వేల కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను కూడా సమర్పించింది. రూ. 25,000కోట్లకు సెబీ ఆమోదం తెలిపినట్లు కంపెనీ వెల్లడించింది. హ్యుందాయ్ మోటార్ రూ. 25,000 కోట్ల ఆఫర్-ఫర్-సేల్ యొక్క డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను మార్కెట్ రెగ్యులేటర్ SEBI ఆమోదించింది.
దీంతో భారత్ లో అతిపెద్ద IPOగా హ్యుందాయ్ కంపెనీ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. హ్యుందాయ్ IPO అక్టోబర్‌లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ రాబోయే IPO ఎల్ఐసీ $2.7 బిలియన్ల లిస్టింగ్ రికార్డును హ్యుందాయ్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద IPO ఎల్ఐసీ. ఇది రూ. 21,008 కోట్ల IPOగా మొదటిస్థానంలో ఉంది.
LIC తర్వాత, One97 (Paytm మాతృ సంస్థ) రూ. 18,300 కోట్ల ఐపీఓ వచ్చింది. పేటీఎం IPO నవంబర్ 2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది కాకుండా కోల్ ఇండియా రూ.15,199 కోట్ల ఐపీఓ నవంబర్ 2010లో మార్కెట్లోకి రాగా.. రిలయన్స్ పవర్ రూ.11,563 కోట్ల ఐపీఓ ఫిబ్రవరి 2008లో వచ్చింది. హ్యుందాయ్ కొరియన్ మాతృ సంస్థ నుండి హ్యుందాయ్ ఇండియా IPO కోసం అమ్మకానికి ఆఫర్ ఉంటుంది. కంపెనీ ఎలాంటి కొత్త షేర్లు జారీ చేయదు.
Also Read: Today Gold Rate: సెప్టెంబర్ 25 బుధవారం బంగారం ధరలు.. 70వేలు దాటిన తులం బంగారం
ఆఫర్ ద్వారా తన ఈక్విటీలో దాదాపు 17శాతం తగ్గించుకోవచ్చని అంచనా. 17శాతం వాటా కోసం అంచనా వేసిన $3 బిలియన్ల ఆఫర్ కంపెనీ విలువ సుమారు $18 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.4 లక్షల కోట్లు. దీని తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా రూ. 3.8 లక్షల కోట్లు, టాటా మోటార్స్ రూ. 3.6 లక్షల కోట్ల వద్ద ఉన్నాయి.
హ్యుందాయ్ IPOకి ముందు తన విస్తరణ ప్రణాళికల గురించి సూచన చేసింది. 2025 నాటికి దేశంలో వార్షిక ఉత్పత్తిని ఒక మిలియన్ యూనిట్లకు పెంచుతామని కంపెనీ తెలిపింది. సరసమైన ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారించి 2025 నుంచి స్థానికంగా ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. భారత్ లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు కంపెనీ రూ.32,000 కోట్లు వెచ్చించాలని ప్లాన్ చేసింది. ఈ డబ్బుతో కంపెనీ మహారాష్ట్రలో కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు తెలిపింది. గత ఏడాది జనరల్ మోటార్స్ నుంచి కంపెనీ ఈ ఫ్యాక్టరీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Ev Cars: ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ.15 లక్షల తగ్గింపు.. ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.