Today Gold Rate: సెప్టెంబర్ 25 బుధవారం బంగారం ధరలు.. 70వేలు దాటిన తులం బంగారం

 Gold Rate Today:  దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. వెండి ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

Written by - Bhoomi | Last Updated : Sep 25, 2024, 10:24 AM IST
Today Gold Rate: సెప్టెంబర్ 25 బుధవారం బంగారం ధరలు.. 70వేలు దాటిన తులం బంగారం

Today Gold And Silver Rates: బంగారం ధర రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్తోంది తాజాగా బంగారం ధర రికార్డును సృష్టిస్తూ రూ.76,000 దాటింది. 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 76,370 కాగా, 22 క్యారట్ల రూ. 70,010 గా నమోదు అయ్యింది. బంగారం ధరలు తొలిసారిగా రికార్డు స్థాయిని నమోదు చేశాయి. దీంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. బంగారం ధరలు  ఈ రేంజ్ లో పెరగడంతో  అటు ఆభరణాలు  అమ్మవారు సైతం కస్టమర్లు భవిష్యత్తులో వస్తారా రారా అనే ఆందోళనలో ఉన్నారు. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 300 రూపాయలు పెరిగింది.  

ఆకాశమే హద్దుగా బంగారం దూసుకెళ్తోంది.  ప్రస్తుతం నమోదైన ఈ ధర చరిత్రలోనే మొదటిసారిది కావడం విశేషం. పసిడి ధర ఇకనుంచి ఎంత పెరిగినా అది కొత్త రికార్డు అవుతుంది.  బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అమెరికాలో ఒక ఔన్సు బంగారం ధర 2700  డాలర్లు తాకింది దీంతో బంగారం ధర అమెరికాలో సైతం ఆల్టైమ్ రికార్డును సృష్టించింది. ఫలితంగా పసిడి ధరలు అటు మన దేశంలో కూడా భారీగా పెరగడానికి కారణం అయ్యింది. ముందుగా ఆ ఊహించుకున్నట్లుగానే బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడమే అని  నిపుణులు చెబుతున్నారు. 

Also Read: New Rules From October: అక్టోబర్‌ 1 నుంచి 5 కొత్త రూల్స్‌.. ఏమిటీ ఆ భారీ మార్పులు ముందుగానే తెలుసుకోండి..  

దీని ఫలితంగా అమెరికా  ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేవారు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. బంగారం ప్రస్తుతం ఉన్న రేంజ్ నుంచి మరింత  పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పసిడి ధరలు ఇంకా ఎంత పెరుగుతాయి అనే  అంశం పైన ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. 

ప్రస్తుతం రాబోయే దసరా, దీపావళి, ధన త్రయోదశి సీజన్ సందర్భంగా బంగారం ధర కనీసం  78000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని  నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర 80000 తాకే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుత బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఎవరైతే ఆభరణాలు కొనుగోలు చేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

 ముఖ్యంగా బంగారు ఆభరణాలు కొనుగోలు విషయంలో నాణ్యత అలాగే బరువు విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావద్దని  ఒక గ్రాము తేడా వచ్చిన 7500 నష్టపోయే ప్రమాదం ఉందని కూడా సూచిస్తున్నారు.  ముఖ్యంగా హాల్ మార్క్ బంగారం మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు చెప్తున్నారు.

Also Read: IRCTC  Kerala Tour:  దసరా సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? కేరళకు IRCTC అదిరిపోయే ప్యాకేజీ.. పూర్తి వివరాలివే  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News