Billionaires in India: బిలియనీర్లు ఇక్కడే అత్యధికం.. దేశవ్యాప్తంగా ఎంతమందంటే?
Billionaires in India: హరూన్ రిచ్ లిస్ట్ 2022లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 249 మంది భారతీయులు బిలియనీర్లుగా ఉన్నట్లు తెలిసింది. అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరంగా ముంబయి నిలిచింది.
Billionaires in India: దేశ ఆర్థిక రాజధాని మరో రికార్డు సృష్టించింది. దేశంలో అత్యధిక ధనవంతులు ఉన్న నగరంగా నిలిచింది. హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం ఈ విషయం తెలిసింది. హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 నివేదిక.. మొత్తం 69 దేశాల్లో 2,557 కంపెనీల్లో 3,381 మంది బిలియనీర్లను గుర్తించింది. ఇందులో 2,071 మంది బిలియనీర్ల సంపద గతంతో పోలిస్తే మరింత పెరిగింది. 942 మంది సంపద కాస్త తగ్గింది. 490 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరారు.
దేశంలో బిలియనీర్లు అధికంగా ఉన్న టాప్-3 నగరాలు..
ముంబయిలో 72 మంది బిలియనీర్లు ఉన్నారు.
51 మంది బిలియనీర్లతో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది.
ఐటీ హబ్ బెంగళూరులో మొత్తం 28 బిలియనీర్లు ఉన్నట్లు తెలిసింది.
దేశంలో ఎంతమందంటే?
హరున్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం.. 249 మంది భారతీయులు బిలియనీర్లుగా ఉన్నారు. అందులో 215 మంది దేశంలో నివసిస్తున్నారు. ఇక దేశంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి బిలియనీర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది అని నివేదిక వివరించింది.
మిలియనీర్లు అధికంగా ఉన్న నగరాలు ఇవే..
దేశంలో అత్యధికంగా మిలియనీర్లు (డాలర్లపరంగా) ఉన్న నగరాల్లో కూడా ముంబయి ప్రథమ స్థానంలో ఉంది. మొత్తం 20,300 మంది మిలియనీర్లు ముంబయిలో నివసిస్తున్నట్లు హరున్ రిచ్ లిస్ట్ నివేదిక పేర్కొంది. ఇక ఢిల్లీ, కోల్‌కతాలు 17,400, 10,500 మందితో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఇక దేశంలో మిలియనీర్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 11 శాతం పెరిగింది. ప్రస్తుతం 4,58,000 మంది మిలియనీర్లు దేశంలో ఉన్నారు. 2026 నాటికి ఈ సంఖ్య 6 లక్షలకు చేరొచ్చని నివేదిక అంచనా వేసింది.
Also read: ATF price hike: ఆల్‌టైం హైకి విమాన ఇంధన ధరలు - కిలో లీటర్ రూ.లక్ష పైకి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook