Oben Rorr Electric Bike: సాధారణ ధరలోనే స్పోర్ట్స్ లుక్‌తో ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జింగ్‌తో 200 కిమీ మైలేజ్..

Oben Rorr Electric Bike: ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ బైక్స్‌దే కావడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ బైక్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఇండియన్ మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 05:12 PM IST
  • ఒబెన్ ఎలక్ట్రిక్ నుంచి కొత్త ఈ బైక్
  • రోర్ పేరుతో లాంచ్ చేసిన ఒబెన్ ఎలక్ట్రిక్
  • అదిరిపోయే మైలేజ్, బ్యాటరీ సామర్థ్యం
Oben Rorr Electric Bike: సాధారణ ధరలోనే స్పోర్ట్స్ లుక్‌తో ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ చార్జింగ్‌తో 200 కిమీ మైలేజ్..

Oben Rorr Electric Bike: ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ కంపెనీ 'ఒబెన్ ఎలక్ట్రిక్' నుంచి కొత్త బైక్ 'రోర్' లాంచ్ అయింది. స్పోర్ట్స్ లుక్‌తో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ధర రూ.99,999. కేవలం రెండు గంటల్లోనే దీని బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 200 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 100 కేఎంపీహెచ్.  కేవలం 3 సెకన్లలోనే ఇది 0-40 యాక్సిలెరేషన్‌ని అందుకుంటుంది.

'రోర్' ఎలక్ట్రిక్ బైక్‌ను పూర్తిగా ఇండియాలోనే తయారుచేసినట్లు ఒబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వెల్లడించింది. బైక్ డిజైన్, డెవలప్‌మెంట్, మాన్యుఫాక్చరింగ్ పూర్తిగా ఇండియాలోనే చేసినట్లు తెలిపింది. ఇవాళ్టి నుంచే రోర్ ప్రీ బుకింగ్స్ ప్రారంభమైనట్లు పేర్కొంది. కస్టమర్లు కేవలం రూ.999తో రోర్ బైక్‌ను ప్రీ బుక్ చేసుకోవచ్చునని.. ఈ బైక్ మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. 

బైక్ ధర.. ఏ రాష్ట్రంలో ఎంతంటే...

ఆయా రాష్ట్రాల్లోని సబ్సిడీని బట్టి రోర్ ఎలక్ట్రిక్ బైక్ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. ఢిల్లీలో రూ.94,999, మహారాష్ట్రలో రూ.99,999, గుజరాత్‌లో రూ.1,04,999, రాజస్తాన్‌లో రూ.1,14,999, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,తెలంగాణలలో రూ.1,24,999గా ఉంది.

Also Read: Pallavi Raju: ఏపీ డిప్యూటీ సీఎంకు బిగ్ షాక్... టీడీపీలో చేరుతున్న ఆడపడుచు... 

Also Read: IPL 2022: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబయి ఇండియన్స్ కు ఎదురుదెబ్బ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News