Bitcoin Value: బిట్‌కాయిన్. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న ఒక ఎకానమీ. గత కొద్దికాలంగా బిట్‌కాయిన్ విలువ విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగనుందని తెలుస్తోంది. బ్లూమ్‌బర్గ్ విడుదల చేసిన సంచలన నివేదిక అదే చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరెన్సీకు సమాంతరంగా బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ(Cryptocurrency)ప్రస్తుతం దూకుడులోనే ఉంది. మధ్యలో కొద్దికాలం అనిశ్చితి నెలకొన్నా భవిష్యత్ కన్పిస్తోందనే అంచనా ఉందంటున్నారు ఆర్ధిక రంగ నిపుణులు. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌ది కీలకమైన స్థానం. అయితే గత కొద్దికాలంగా ఎల్ సాల్వాడార్ దేశం తీసుకున్న నిర్ణయంతో బిట్‌కాయిన్‌లో అనిశ్చితి నెలకొంది. బిట్‌కాయిన్‌కు చట్టబద్దత కల్పిస్తూ ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించడమే దీనికి కారణం. అయితే ప్రస్తుతం మరోసారి బిట్‌కాయిన్ విలువ పుంజుకుంది. తాజాగా బిట్‌కాయిన్‌పై బ్లూమ్‌బర్గ్ విశ్లేకుడు మైక్ మెక్‌గ్లోన్ చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపుతోంది. 


2021 ఏడాది చివర్లో బిట్‌కాయిన్(Bitcoin) విలువ లక్ష డాలర్లు అంటే ఇండియన్ రూపీస్‌లో 73.65 లక్షలకు చేరుకుంటుందంటూ మైక్ మెక్‌గ్లోన్ ప్రకటించారు. ఇదే ఇప్పుడు కొత్త ఆశలు రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్‌ను ఎక్కువమంది ప్రజలు స్వీకరిస్తున్నారనేది ఆయన వాదన. బిట్‌కాయిన్ 2021 చివర్లో గణనీయమైన పురోగతిని సాధిస్తుందంటున్నారు. బిట్‌కాయిన్ పూర్వపు ట్రేడింగ్ గణాంకాల ఆధారంగా ఆయనీ అంచనాకు వచ్చారు. 2021 ఏప్రిల్-మే నెలల్లో జరిగిన బిట్‌కాయిన్ క్రాష్‌తో ప్రస్తుత ట్రేడింగ్ గణాంకాలు సరిసమానమయ్యాయంటున్నారు. అందుకే భవిష్యత్‌లో బిట్‌కాయిన్ విలువ భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 33.54 లక్షలకు ట్రేడ్ అవుతోంది. బిట్‌కాయిన్ త్వరలోనే 50 వేల మార్క్ దాటే అవకాశాలున్నాయని మార్కెట్ అంచనా. బ్లూమ్‌బర్గ్(Bloomberg)విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో కొత్త ఆశలు రేపుతున్నాయి.


Also read: Amazon Vs China: అమెజాన్ నిర్ణయం చైనా ఆర్ధిక వ్యవస్థను దెబ్బ కొడుతుందా లేదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook