Britannia Biscuit Company Announces Divided of 72 Rupees Per Share: ప్రపంచవ్యాప్తంగా బిస్కట్ అండ్ బ్రెడ్‌కు ఈ కంపెనీ సుపరిచితం. 5 రూపాయల్నించి 10 రూపాయలు బిస్కట్లు అమ్మకునే కంపెనీ ఇది. 2022-23 గత ఆర్ధిక సంవత్సరానికి ఇన్వెస్టర్లకు ఊహించని లాభాన్ని ప్రకటించింది. బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్లకు ఇక పండగే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిస్కట్లు, బ్రెడ్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యమైన కంపెనీ బ్రిటానియా. బ్రిటానియా బిస్కట్స్ అంటే తెలియనివాళ్లుండరు. ప్రతి దేశంలో, ప్రతి ఊర్లో లభిస్తుంది. కేవలం 5 రూపాయల్నించి, పది రూపాయల్నించి కూడా బిస్కట్లు దొరుకుతాయి. ఈ కంపెనీ ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. అదే డివిడెండ్. కంపెనీ తన షేర్ హోల్డర్లకు ఇంటెరిమ్ డివిడెండ్ ప్రకటన చేసింది. ఒక్కొక్క షేర్‌పై 72 రూపాయలు ఇంటెరిమ్ డివిడెండ్ అందించనుంది. దీంతో ఇన్వెస్టర్లకు భారీగా లాభం కలగనుంది. 


Also Read: Facebook New Feature: ఫేస్‌బుక్ కొత్త ఫీచర్, వీడియో కాల్ చేస్తూనే గేమ్స్ సౌకర్యం


బిస్కట్ అండ్ బ్రెడ్ ఇతర పదార్ధాలు తయారు చేసే బ్రిటానియా ఇండస్ట్రీస్ 2022-23 ఆర్ధిక సంవత్సరానికి తన షేర్ హోల్డర్లకు ఒక్కొక్క షేర్‌పై 72 రూపాయలు ఇంటెరిమ్ డివిడెండ్ ప్రకటించింది. అటు స్టాక్ ఎక్స్చేంజ్‌కు ఇదే విషయాన్ని అందించింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిన్న జరిపిన భేటీలో 72 రూపాయల ఇంటెరిమ్ డివిడెండ్ చెల్లించే నిర్ణయాన్ని తీసుకున్నారు. 


ఇంటెరిమ్ ప్రోఫిట్ పొందేందుకు షేర్ హోల్డర్ల అర్హత నిర్ధారించేందుకు ఏప్రిల్ 13, 2023 చివరి తేదీగా ఉంది. అదే తేదీన పాత తేదీపై స్టాక్ ట్రేడ్ అవుతుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో కూడా బ్రిటానియా డివిడెండ్ ప్రకటించింది. అప్పుడు ఒక్కొక్క షేర్‌కు 56.50 రూపాయలు చెల్లించింది. 


అటు ఆగస్టు 2020లో కంపెనీ ఒక్కొక్క షేర్‌కు 83 రూపాయలు చెల్లించింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికం. బ్రిటానియా కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 52 వారాల కనిష్టం 3132.05 రూపాయలైతే 52 వారాల గరిష్టం 4669.20 రూపాయులంది. ప్రస్తుతం అంటే ఏప్రిల్ 5, 2023 న బ్రిటానియా కంపెనీ షేర్ విలువ 4325 రూపాయలుంది.


Also Read: Share Market News: ప్రపంచంలో అత్యంత ఖరీదైన షేర్ ఏది, ధర ఎంతో తెలిస్తే షాక్‌కు గురవాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook