BSNL Plans: బీఎస్ఎన్ఎల్ కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. గతంతో పోలిస్తే ధరల్ని పెంచి..ప్రయోజనాలు మాత్రం తగ్గించేసింది బీఎస్ఎన్ఎల్ సంస్థ. బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఎస్ఎన్ఎల్ ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇప్పుుడు కాస్త ప్రియంగా మారుతున్నాయి. గతంతో పోలిస్తే తక్కువ ప్రయోజనాలతో మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న ప్లాన్స్‌లోనే..ప్రయోజనాలు తగ్గించి కొత్తగా ప్రవేశపెట్టింది. ఇందులో 99 రూపాయలు ప్రీపెయిడ్ ప్లాన్, 118 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్, 319 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఉన్నాయి. 


ముందుగా 99 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ వ్యాలిడిటీ  ఇప్పుడు కేవలం 18 రోజుల కోసం వస్తోంది. గతంలో ఇదే ప్లాన్ 22 రోజులకు ఉండేది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యముంటుంది. ఇతర ప్రయోజాలేవీ లేవు. ఇక 118 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కాల పరిమితి 26 రోజులుండేది గతంలో. ఇప్పుడు 20 రోజులకు కుదించేసింది. అంటే 6 రోజులు తగ్గించేసింది. అంతేకాకుండా గతంలో 0.5 జీబీ డేటా ఉండేది. ఇప్పుడది లేదు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యముంది. ఇక మరో ప్లాన్ 319 రూపాయలది. ఇది గతంలో 75 రోజుల వ్యాలిడిటీతో వచ్చేది. ఇప్పుడు 65 రోజులకు తగ్గిపోయింది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంది. గతంలో 3 వందల ఎస్ఎంఎస్‌లు ఉండేవి. మొత్తం 10 జీబీ డేటా ఉండేది. ఇప్పుడు అదనపు ప్రయోజనాలేవీ లేవు. 


Also read: Ration Card: రేషన్ కార్డు అర్హులా కాదా, లేకపోతే వెంటనే కార్డు సరెండర్ చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook