Budget 2023 Expectations: ఇన్‌కంటాక్స్ స్లాబ్, హెచ్ఆర్ఏ రూల్స్ మార్పు ఉంటుందా, బడ్జెట్‌పై ఉద్యోగులు ఏం ఆశిస్తున్నారు
Budget 2023 Expectations: దేశంలో ట్యాక్స్ పేయర్లలో అత్యధికులు ఉద్యోగులే. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎక్కువగా తోడ్పాటు అందించేది కూడా వీళ్లే. ఈ ట్యాక్స్ పేయర్ల హెచ్ఆర్ఎ నిబంధనల్లో మార్పులొచ్చాయి. ఆ వివరాలు మీ కోసం..
మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ రానుంది. బడ్జెట్ 2023పై ఇన్‌కంటాక్స్ పేయర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇన్‌కంటాక్స్ డిడక్షన్, స్లాబ్ రేట్ల విషయంలో కీలకమైన ప్రకటన వెలువడవచ్చని ట్యాక్స్ పేయర్లు ఆశిస్తున్నారు.
2022 డేటా ప్రకారం మొత్తం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్‌లో 50 శాతం ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ 1 ద్వారా వ్యక్తిగత జీతగాళ్లే దాఖలు చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ కేంద్ర బడ్జెట్ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి ఉద్యోగులు ఆశించేది ఎక్కువే ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినా, ఇన్వెస్ట్‌మెంట్ లేదా ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉన్నా సరే.. ట్యాక్స్ సేవింగ్ మాత్రం 2014లో ఎంత ఉందో అంతే ఉండటంతో ఈసారైనా మినహాయింపులుంటాయేమోనని ఆశలు పెట్టుకున్నారు. ఇన్‌కంటాక్స్ నిబంధనల్లో శాలరీడ్ ఉద్యోగుల కోసం దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సవరణలు చేయాల్సి ఉంది.
ట్యాక్స్ స్లాబ్స్‌లో రివిజన్
ప్రస్తుతం ట్యాక్స్ పేయర్లకు రెండు ట్యాక్స్ రెజైమ్స్ అందుబాటులో ఉన్నాయి. ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు 2.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు, 5 లక్షల వరకూ ఏ విధమైన ట్యాక్స్ లేకపోవడం. శాలరీడ్ ఉద్యోగుల్లోని మేజర్ ట్యాక్స్ పేయర్లు ఈసారి బడ్జెట్‌లో ట్యాక్స్ మినహాయింపుని 2.5 లక్షల్నించి 5 లక్షలు చేయాలని ఆశిస్తున్నారు.
హెర్ఆర్ఏ నిబంధనల్లో మార్పు
శాలరీడ్ ఉద్యోగులు హెచ్ఆర్ఏ నిబంధనలు అమలు చేసేటప్పుడు మెట్రో నగరాల నిర్వచనంలో మార్పు ఉండాలని కోరుకుంటున్నార. ప్రస్తుతం ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నై, ముంబై మాత్రమే మెట్రో నగరాల్లో ఉన్నాయి. ఈ నగరాలకు చెందినవారు మాత్రమే హెచ్ఆర్ఏ డిడక్షన్ లబ్ది పొందుతున్నారు. అయితే బెంగళూరు వంటి ఇతర నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, ఏకంగా 1.5 మిలియన్ల ఐటీ ఉద్యోగులుండటంతో హెచ్ఆర్ఏ నిబంధనల్లో మార్పు కోరుతున్నారు.
ఇంటి కొనుగోలులో ట్యాక్స్ మినహాయింపు
కేంద్ర బడ్జెట్ నుంచి హౌసింగ్ లోన్ మినహాయింపు పెరగాలని అంచనా ఉంది. ఇళ్లు కొనుగోలు చేసే శాలరీడ్ ఉద్యోగులు అదనపు ఇన్సెంటివ్ లను ఆశిస్తున్నారు. ఇన్‌కంటాక్స్ సెక్షన్ 24బి ప్రకారం ఇంటి కొనుగోలుపై ఏడాదికి 2 లక్షల వరకూ వార్షిక వడ్డీకి ట్యాక్స్ మినహాయింపు ఉంది. అదే విధంగా ఈసారి బడ్జెట్‌లో ట్యాక్స్ పరిమితిని 5 లక్షల వరకూ పెంచాలని కోరుతున్నారు. ఇంటి కొనుగోలుదారులు సెక్షన్ 80 సి ప్రకారం హోసింగ్ లోన్‌పై చెల్లించే ప్రీమియం నుంచి ట్యాక్స్ మినహాయింపు ప్రస్తుతం 1.5 లక్షలుండగా..3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
వ్యక్తిగత రుణాలపై మినహాయింపు
ఎడ్యుకేషన్ రుణం, వ్యక్తిగత రుణం ప్రస్తుతం మార్కెట్‌లో 35 శాతం వాటా కలిగి ఉన్నాయి. సెక్షన్ 80 ఇ ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఎడ్యుకేషన్ రుణంపై మాత్రమే ట్యాక్స్ మినహాయింపు ఉంది. వ్యక్తిగత రుణాలపై లేదు. ఈ క్రమంలో శాలరీడ్ ఉద్యోగులు ఈసారి వ్యక్తిగత రుణాల్నించి కూడా ట్యాక్స్ మినహాయింపు కోరుతున్నారు.
Also read: Budget 2023: భారీ ఉపశమనం.. ట్యాక్స్‌పేయర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook