Business Ideas:  మీరు సంపాదిస్తున్న ఆదాయం సరిపోవడం లేదా? అయితే మీ ఆదాయానికి భూతంలా పనిచేసే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్లాన్ ద్వారా మీరు చక్కటి ఆదాయం మీ ఖాళీ సమయంలో పొందవచ్చు.  ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నగరంలో అలాగే పట్టణాల్లో పల్లెటూర్లలో సైతం కుక్కల పెంపకం అనేది ఒక వ్యాపకంగా మారింది.  దీన్నే ఒక వ్యాపార అవకాశంగా మార్చుకున్నట్లయితే.. మీకు పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తుంది . అవును మీరు విన్నది నిజమే.  డాగ్ ఫార్మ్స్ గురించి మీరు వినే ఉంటారు.  మంచి జాతికి చెందినటువంటి కుక్కలను కొనుగోలు చేసేందుకు చాలా మంది యజమానులు ఎదురు చూస్తూ ఉంటారు.  ముఖ్యంగా తమ పిల్లలకు గర్ల్ ఫ్రెండ్స్ కు తమ కుటుంబ సభ్యులకు తమ స్నేహితులకు కానుకగా ఇవ్వడానికి కూడా కుక్కపిల్లలను ఎంపిక చేసుకుంటారు.  అయితే ఈ కుక్కపిల్లలు మంచి జాతికి చెందినవి అయి ఉండాలి.  అప్పుడే వీటికి మంచి ధర పలుకుతుంది. 


మీరు కూడా డాగ్ ఫార్మ్ స్థాపించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది:


మీరు కూడా డాగ్ ఫామ్ ద్వారా మంచి ఆదాయం సంపాదించాలి అనుకున్నట్లయితే.. దీనికోసం మీరు ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు వీటిలో మీరు బోండ్లను ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం కుక్క పిల్లల కోసం మంచి జాతికి చెందిన డాగ్స్ ను సేకరించి వాటిని బ్రీడింగ్ చేయడం ద్వారా మీరు కుక్క పిల్లలను పొందవచ్చు. ఈ కుక్క పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని ఆన్లైన్లో గాని నేరుగా ఫామ్ ద్వారా కానీ విక్రయించవచ్చు.


కస్టమర్లు సాధారణంగా మూడు రకాల కుక్క పిల్లలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మొదటిది తమ ఇంటి రక్షణ కోసం అల్సిషియన్, లాబ్రడార్, గోల్డెన్ రిట్రీవర్ , డాబర్మాన్, జర్మన్ షెఫర్డ్ వంటి కుక్కలను కాపలా కోసం పెంచుకుంటారు. ఇవి శత్రువుల పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఎవరైనా ఇంట్లో దొంగతనానికి కానీ అనుమానితులను కానీ ఎదురు దాడి చేయడానికి ఈ కుక్కలు ఉపయోగిస్తారు. అందుకు తగ్గట్టుగా ఈ కుక్కలకు ట్రైనింగ్ కూడా ఇస్తారు.


ఇక రెండో రకం కుక్కపిల్లలు సరదాగా ఇంట్లో తిరుగుతూ అందంగా చూడముచ్చటగా ఉంటాయి. వీటిలో ఎక్కువగా పమేరియన్ జాతికి చెందిన బొచ్చు కుక్కలు ప్రధానంగా చెప్పవచ్చు. అలాగే వీటితోపాటు పొట్టిగా అందంగా కనిపించే కుక్క పిల్లలు కూడా జనం కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.


Also Read: Gold Rate: లక్ష.. లక్ష్యంగా పరుగులు పెడుతున్న బంగారం ధర.. వామ్మో తులం 1 లక్ష అయితే ఎట్లా?   


ఇక మూడో రకం కుక్కపిల్లలు అటు చూడటానికి అందంగాను రక్షణ కోసం కూడా ఉపయోగపడుతుంటాయి. వీటిలో ముఖ్యంగా సైబీరియన్ హస్కీ కుక్కలు ప్రధానంగా చెప్పవచ్చు. అలాగే డాల్మేషన్ కుక్కలు కూడా ఇవి చూడటానికి అందంగాను రక్షణ పరంగా కూడా చాలా బలంగాను ఉంటాయి.


ఈ కుక్క పిల్లల ధరలు ఆయా జాతి నీ బట్టి ఉంటాయి సాధారణంగా వీటి ధర పదివేల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి రెండు మూడు లక్షల వరకు కూడా ఉంటాయి. వీటిలో సైబీరియన్ హస్కీ జాతికి చెందిన కుక్క చాలా ఖరీదైనది. అయితే కుక్క పిల్లల బ్రీడింగ్ విషయంలో చాలా జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. క్రాస్ బ్రీడింగ్ జరిగిన కుక్క పిల్లలకు డిమాండ్ ఉండదు. కుక్క పిల్లల ఆరోగ్యo టీకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


 మీరు డాగ్ ఫామ్ నిర్వహించాలి అనుకున్నట్లయితే.. కచ్చితంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ బ్రీడింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ కుక్క పిల్లలకు మంచి డిమాండ్ లభిస్తుంది. వీలైతే వెటర్నరీ డాక్టర్ సంరక్షణలో కుక్క పిల్లలకు ఎప్పటికప్పుడు ఆరోగ్యం తనిఖీ చేయించాలి. అప్పుడే మీరు ఈ డాగ్ ఫామ్ ను సక్సెస్ఫుల్గా రన్ చేయగలరు.


Also Read:  Richest State in India: దేశంలో అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్ర .. తలసారి ఆదాయంలో తెలంగాణే నెంబర్ వన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి