Moto G60 for RS 149: కేవలం రూ.149లకే Moto G60 స్మార్ట్ ఫోన్.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!
Moto G60 for RS 149: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కస్టమర్లను ఆకర్షించేందుకు మరో సేల్ తో ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్ సేల్ ను జనవరి 27 నుంచి 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా అనేక గాడ్జెట్స్ ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉన్నాయి. Moto G60 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ.149 లకే కొనుగోలు చేయోచ్చు. అదెలాగో తెలుసుకోండి.
Moto G60 for RS 149: ఫ్లిప్ కార్ట్ లో ఎలక్ట్రానిక్స్ పై సూపర్ సేల్ నడుస్తోంది. ఇది జనవరి 27 నుంచి 31 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సేల్ ద్వారా స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ టీవీలు, ఫ్రిజ్ లు, ఎయిర్ కండీషనర్ వరకు ప్రతిదానిపై ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక తగ్గింపును అందిస్తుంది. ప్రస్తుతం ఈ సేల్ ద్వారా రూ.149 లకే స్మార్ట్ ఫోన్ విక్రయిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
Moto G60పై ఉత్తమ ఆఫర్లు
ఫ్లిప్ కార్ట్ సేల్ లో ప్రస్తుతం మోటో జీ60 (Moto G60) రూ.21,999లకు విక్రయిస్తున్నారు. అయితే ఆ ధరకు బదలుగా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.149లకే సొంతం చేసుకునే ఆఫర్లు అందుబాటులో కూడా ఉన్నాయి. 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులో ఉన్న ఈ Moto G60 స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ సేల్ లో 22 శాతం డిస్కౌంట్ తో.. అనగా రూ. 16,999లకే విక్రయానికి ఉంది.
అయితే ఈ కొనుగోలులో సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లిస్తే తక్షణం 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అత్యధికంగా రూ.1000 తగ్గింపు లభించే అవకాశం ఉంది. తద్వారా ఈ మొబైల్ రూ.15,999లకే అందుబాటులో ఉంది.
అయితే ఈ ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా రూ.18,850 వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. పైన పేర్కొన్న ఆఫర్లతో రూ.21,999లకు విక్రయానికి ఉన్న ఈ Moto G60 స్మార్ట్ ఫోన్ రూ.149లకే కొనుగోలు చేసేయోచ్చు.
Moto G60 ఫీచర్లు
1) డిస్ ప్లే - 6.78-అంగుళాల పూర్తి HD + IPS LCD డిస్‌ప్లే
2) స్టోరేజ్ - 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్
3) కెమెరా - 108MP (మెయిన్ సెన్సార్) 8MP (రెండో సెన్సార్), 2MP మూడో కెమెరా
4) ఫ్రంట్ కెమెరా - 32MP
5) ప్రాసెసర్ - Qualcomm Snapdragon 732G
6) బ్యాటరీ - 6,000mAh వంటి ఫీచర్లతో Moto G60 అందుబాటులో ఉంది.
Also Read: February 2022 Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంక్ సెలవులు.. రాష్ట్రాల వారీగా పూర్తి వివరాలివే..
Also Read: Jio 5G Test Details: 5జి టెస్ట్‌లో దూసుకుపోతున్న జియో, ఏడాది చివరికి ఇండియాలో అందుబాటులో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook