Sovereign Gold Bonds: సావరీన్ గోల్డ్ బాండ్స్ మరోసారి ప్రభుత్వం అవకాశమిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తున్న ఈ బాండ్స్ వాయిదాలు రేపట్నించి ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ఆర్బీఐ స్వయంగా జారీ చేసిన సావరీన్ గోల్డ్ బాండ్స్ మరోసారి ప్రారంభమవుతున్నాయి. సావరీన్ గోల్డ్ బాండ్ కొనుగోలు చేయాలనుకునేవారి కోసం 2022-23 సంవత్సరం తొలి వాయిదా జూన్ 20 నుంచి జూన్ 24 వరకూ ఐదు రోజులపాటు ఉంటుంది. గ్రాముకు 5 వేల 91 రూపాయలు ధర నిర్ధారించారు. ఆన్‌లైన్ అప్లే చేసేందుకు డిజిటల్ చెల్లింపులకు గ్రాముకు 50 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే గ్రాముకు 5 వేల 41 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 


సావరీన్ గోల్డ్ బాండ్ అనేది ఆర్బీఐ జారీ చేసేది. డీమ్యాట్ రూపానికి కన్వర్ట్ అవుతుంది. బంగారం బరువు ఆధారంగా విలువ ఉంటుంది. ఐదు గ్రాముల బంగారం బాండ్ ఉంటే..మార్కెట్‌లో ఐదు గ్రాముల బంగారం విలువను బట్టే ఉంటుంది. దీనికి సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి బాండ్ అమ్మేసిన తరువాత ఆ డబ్బు పెట్టుబడిదారుడి ఎక్కౌంట్‌లో డిపాజిట్ అవుతుంది. సావరీన్ గోల్డ్ బాండ్‌పై ఏడాదికి 2.5శాతం ఫిక్స్‌డ్ వడ్డీ ఉంటుంది. ప్రతి ఆరునెలలకు ఆ వడ్డీ డబ్బు మీ ఎక్కౌంట్‌కు చేరుతుంది. అయితే ఇది ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది. సావరీన్ గోల్డ్ బాండ్స్ నాణ్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్ఎస్ఈ ప్రకారం..గోల్డ్ బాండ్ విలువ 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధరను బట్టి ఉంటుంది. 


8 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయిన తరువాత దీనిపై ఏ విధమైన ట్యాక్స్ ఉండదు. మరోవైపు ఐదేళ్ల తరువాత విత్‌డ్రా చేయాలనుకుంటే లాంగ్ టెర్మ్ కేపిటల్ గెయిన్ 20.80 శాతం చొప్పున లాభం ఉంటుంది. పెట్టుబడి పెట్టేందుకు ఆర్బీఐ చాలా ఆప్షన్స్ ఇస్తోంది. బ్యాంక్ , పోస్టాఫీసు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల ద్వారా కూడా బాండ్స్ తీసుకోవచ్చు. ఆ కార్యాలయాల్లో ఓ ఫారమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఎక్కౌంట్ నుంచి డబ్బులు కట్ అయిన తరువాత..మీ డీ మ్యాట్ ఎక్కౌంట్‌కు బాండ్స్ బదిలీ అవుతాయి.


అన్ని బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్లు, స్టాక్ ఎక్స్చేంజ్‌ల ద్వారా ఈ బాండ్స్ విక్రయించవచ్చు.పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ పతనం నేపధ్యంలో గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి లాభదాయకం కావచ్చని తెలుస్తోంది. ఏడాది చివరికి మీ బంగారం 55 వేలకు చేరుతుంది. 


Also read: Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇత్తడి సింహాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? దాని వల్ల ప్రయోజనాలు ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.