Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇత్తడి సింహాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? దాని వల్ల ప్రయోజనాలు ఏంటి?

Astrology tips: కొందరి ఇంట్లో ఇత్తడి సింహాన్ని ఉంచడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఆ ఇత్తడి సింహాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారు? దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2022, 04:39 PM IST
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇత్తడి సింహాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? దాని వల్ల ప్రయోజనాలు ఏంటి?

Astrology tips:  వాస్తు శాస్త్రం (Vastu Shashtra) ప్రకారం, ఇంట్లో ఉండే వస్తువులన్నీ ప్రజల జీవితాలపై మంచి లేదా చెడు ప్రభావం చూపుతాయి. ఈ రోజు మనం ఇత్తడి సింహం (Brass lion) గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఇంట్లో మీరు ఇత్తడి సింహాన్ని చూసే ఉంటారు. ఇత్తడి సింహాన్ని సరైన దిశలో ఉంచినట్లయితే...దాని వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి.

ఇత్తడి సింహం యొక్క ప్రయోజనాలు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇత్తడి సింహాన్ని ఇంట్లో ఉంచినట్లయితే, అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇత్తడి సింహం ఇంట్లో నివసించే వారి మనసులో విశ్వాసాన్ని నింపుతుంది. మీలోని భయాన్ని పోగొడుతుంది. అలాగే, ఇది కెరీర్ మరియు వ్యాపారం రెండింటిలోనూ పురోగతిని తీసుకురాగలదు. 

బృహస్పతి నివాసం
సింహం ఇత్తడి లోహంతో తయారు చేయబడినందున, దేవగురువు బృహస్పతి దానిలో నివసిస్తారు. ఈ కారణంగానే ఎవరి జాతకంలో గురువు బలహీనంగా ఉన్నారో, అతడు తన ఇంట్లో ఇత్తడితో చేసిన సింహం ప్రతిమను పెట్టుకోవడం మంచిది. 

ఏ దిక్కున ఉంచాలి?
ప్రధానంగా ఇత్తడి సింహాన్ని ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచుతారు. అయితే మీరు మీ ఇంట్లో ఇత్తడి సింహాన్ని ఉంచినప్పుడల్లా దాని ముఖం ఇంటి మధ్యలో ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా ఇత్తడి సింహంపై ఎలాంటి దుమ్ము, ధూళి, మట్టి ఉండకూడదు. అలా ఉన్నట్లయితే అది మీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇత్తడి సింహాన్ని ఒక ప్లేస్ లో ఉంచితే...మరల దానిని ఆ స్థానం నుండి కదల్చకూడదు. 

ప్రతికూలతలు
ఇత్తడి సింహం ఆర్థిక సంక్షోభం మరియు పరువు నష్టం కూడా దారితీయవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ ఇంట్లో ఇత్తడి సింహాన్ని పెట్టేటప్పుడు నిపుణుల సలహా మేరకు సరైన దిశలో పెట్టండి.  

Also Read: Zodiac Nature: మీ రాశిని బట్టి మీరు ఖర్చు చేసేవారా లేదా పిసినారి వారా చెప్పేయవచ్చు! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News