iphone offer: స్మార్ట్​ఫోన్లలో యాపిల్ ఐఫోన్లకు ఉండే ప్రత్యేకతే వేరు. చాలా మందికి ఐఫోన్​ను కొనాలని ఉన్నా.. ధర ఎక్కువ అనే ఉద్దేశంతో అందుకు ఇష్టపడరు. అయితే ఐఫోన్లపై ఆఫర్లు ఉన్నాయంటే మాత్రం.. కచ్చితంగా అలాంటి వారు ముందుకొస్తుంటారు. మరి మీరు కూడా ధర ఎక్కువనే కారణంతో ఐఫోన్​ కొనలేకకపోతే.. మీకో గుడ్​ న్యూస్​. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ అదిరే ఆఫర్​తో ఐఫోన్లను విక్రయిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫర్ పూర్తి వివరాలు ఇలా..


ఐఫోన్​ 12 మినిపై ప్రస్తుతం ఈ స్పెషల్ ఆఫర్లను ఇస్తోంది ఫ్లిప్​కార్ట్. చిన్న డిస్​ప్లే, భారీ ఫీచర్లతో కూడీన ఈ స్మార్ట్​ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర మార్కెట్లో రూ.59,900గా ఉంది. అయితే ఫ్లిప్​కార్ట్ ప్రస్తుతం దీనిపై 30 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అంటే దీనిని రూ.41,999కు కొనుగోలు చేయొచ్చు.


ఆ ఫర్ ఇంతటితో ఐపోలేదండోయ్.. ఈ స్పెషల్ డిస్కౌంట్​తో పాటు ఎక్స్ఛేంజ్​, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఎక్స్ంజ్ ఆఫర్​లో మీ పాత ఫోన్​ను వెనక్కి ఇచ్చేయడం ద్వారా మరో రూ.13,000 వరకు తగ్గింపు పొందొచ్చని ఫ్లిప్​కార్ట్​ పేర్కొంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే.. మీరు ఎక్స్ఛేంజ్ చేసే స్మార్ట్​ఫోన్ కండీషన్​, మోడల్​ వంటి వాటిని బట్టే ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తుంది. గరిష్ఠంగా రూ.13 వేలు తగ్గింపు పొందొచ్చు.


ఒకవేళ మీ స్మార్ట్​ఫోన్ ఎక్స్ఛేంజ్​లో మొత్తం విలువ లభిస్తే.. ఐఫోన్ 12 మిని 64 జీబీ వేరియంట్​ను రూ.28,999కే కొనొచ్చు. ఇక దీనికి బ్యాంక్ ఆఫర్లు కూడా తోడైతే ఈ ధర మరింత తగ్గనుంది.


ఐఫోన్ 12 మిని 256 జీబీ ధర ఎంత తగ్గనుందంటే..


ఈ వేరియంట్​పై 25 శాతం తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్. ఈ ఆఫర్​తో రూ.74,900 విలువైన ఈ స్మార్ట్​ఫోన్​ను రూ.55,999కే కొనే వీలుంది. ఈ మోడల్​కు కూడా ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.13 వేల వరకు తగ్గింపు పొందే వీలుంది. ఈ ఆఫర్ పూర్తిగా లభిస్తే.. ఈ వేరియంట్​ను రూ. 42,999కే పొందొచ్చు. దీనికి బ్యాంక్ ఆఫర్లు కలిస్తే ధర మరింత తగ్గుతుంది.


ఐఫోన్ 12 మిని ఫీచర్లు..


5.4 అంగుళాల డిస్​ప్లే (ఓఎల్ఈడీ డిస్​ప్లే)
వెనకవైపు రెండు కెమెరాలు (12 ఎంపీ+12 ఎంపీ)
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఏ 14 బయోనిక్ చిప్​సెట్​
బ్లాక్ కలర్​ వేరియంట్​
5జీ సపోర్ట్​
డ్యుయల్ సిమ్​ (ఒకటి మైక్రో, రెండవది ఈ-సిమ్​)
2,227 ఎంఏహెచ్ బ్యాటరీ


నోట్​: ఈ ఆఫర్​లోని వివరాలు ఫ్లిప్​కార్ట్ వెబ్​సైట్​ ప్రకారం మాత్రమే చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ ఆఫర్​  ద్వారా మొబైల్ కొనాలనుకుంటే.. మరోసారి ఆఫర్ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం ఉత్తమం


Also read: Cardless Cash Withdrawal: కార్డు లేకున్నా ఏటీఎంలలో నగదు విత్​డ్రా ఇలా..


Also read: Mahesh Babu: ఎలక్ట్రిక్​ కారు కొన్న మహేశ్​ బాబు.. స్వయంగా అందించిన ఆడి అధినేత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook