Cardless Cash Withdrawal: కార్డు లేకున్నా ఏటీఎంలలో నగదు విత్​డ్రా ఇలా..

Cardless Cash Withdrawal: ఏటీంలలో త్వరలో డెబిట్ కార్డు లేకున్నా నగదు విత్​డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. మరి ఈ సదుపాయం ఎలా పని చేయనుందో తెలుసా?

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 16, 2022, 07:01 PM IST
  • త్వరలో ఏటీఎంలలో కార్డ్​లెస్ విత్​డ్రా సదుపాయం
  • ఇటీవలే అధికారికంగా ప్రకటించిన ఆర్​బీఐ
  • విధి విధానాలపై త్వరలోనే ప్రకటన చేయనున్న కేంద్రీయ బ్యాంక్
Cardless Cash Withdrawal: కార్డు లేకున్నా ఏటీఎంలలో నగదు విత్​డ్రా ఇలా..

Cardless Cash Withdrawal: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) ఈ నెల ఆరంభంలో నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యమైంది ఏటీఎంల ద్వారా డెబిట్​ కార్డు లేకుండా నగదు విత్​డ్రా చేసుకునే సదుపాయం. అన్ని బ్యాంకుల ఏటీఎంలలో అందుబాటులోకి రానుందని ఆర్​బీఐ చేసిన ఈ ప్రకటనపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది.

ఏటీఎంలలో డెబిట్​ కార్డు లేకున్నా నదు తీసుకోవచ్చని చెప్పినప్పటికీ.. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను మాత్రం ఆర్​బీఐ వెల్లడించలేదు. అయితే కార్డ్​ లెస్ విత్​డ్రా వ్యవస్థ ఎలా పని చేస్తుంనే విషయంపై ప్రస్తుతం వివిధ అంచనాలు ఉన్నాయి. అందులో రెండు ముఖ్యమైన విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి విధానం..

ఈ విధానంలో ఏటీఎంలో ఉండే కంప్యూటర్​ స్కీన్​పైన కార్డ్​లెస్ విత్​డ్రా ఆప్షన్ కనిపించనుంది. దానిని ఎంచుకుంటే.. ఓ క్యూఆర్​ కోడ్​ కనిపిస్తుంది.

ఆ క్యూఆర్​ కోడ్​ను మీ మొబైల్​లో ఉండే యూపీఐ పేమెంట్ యాప్​ల ద్వారా స్కాన్ చేయాలి.

ఆ తర్వాత మీకు ఎంత నగదు అవసరమో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి.. యూపీఐ పిన్​ ఎంటర్ చేయాలి. పేమెంట్​ పూర్తయిన వెంటనే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.

రెండో విధానం..

ఈ విధానంలో కూడా యూపీఐ ఆధారిత విత్​డ్రా విధానం అమలులోకి వస్తే.. ఏటీఎం హోం స్క్రీన్​పై ఈ ఆప్షన్ కనిపిస్తుంది.

ఈ ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకుని.. అందులో మీ యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. తర్వాతి విండోలో ఎంత మొత్తం విత్​డ్రా చేసుకోవాలో ఆ నగదును ఎంటర్ చేయాలి. అప్పుడు మీ యూపీఐ యాప్​కు ఓ రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్​ను యాక్సెప్ట్​ చేసి.. పిన్ ఎంటర్ చేయగానే డబ్బులు విత్​డ్రా అవుతాయి.

నోట్: ఈ రెండు విధానాలు ప్రస్తుతం అధికంగా ప్రచారంలో ఉన్నవి మాత్రమే. ఆర్​బీఐ త్వరలోనే అధికారికంగా కార్డ్​లెస్ విత్​డ్రాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

ఇటీవలి కాలంలో పెరిగిన డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో సైబర్ నేరాలు కాడా భారీగా పెరిగాయి. అదే విధంగా క్లోన్ ఏటీఎం కార్డుల ద్వారా కూడా కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలకు చెక్​ పెట్టే దిశగా ఆర్​బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Also read: Mahesh Babu: ఎలక్ట్రిక్​ కారు కొన్న మహేశ్​ బాబు.. స్వయంగా అందించిన ఆడి అధినేత

Also read: Flipkart Smart TV Offers: రూ.41 వేల విలువైన 50 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.9 వేలకే కొనొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News