EPF Money For Marriages: పెళ్లి కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయొచ్చా ? ఏం చేయాలి ?
EPF Money For Marriages: ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద పొదుపు చేసుకున్న మొత్తాన్ని పదవీ విరమణ చేసిన తర్వాత మొత్తం డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. సర్వీసులో ఉండగా అయితే.. ఇంటి నిర్మాణం, ఇంటికి మరమ్మతులు, హౌజింగ్ లోన్ ఈఎంఐ రీపేమెంట్ లేదా హోమ్ లోన్ క్లోజింగ్, వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
EPF Money For Marriages: ఇంట్లో పెళ్లి పెట్టుకోవడం అంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి. అవసరం అయితే ఇంటికి మరమ్మతుల కానుంచి షాపింగ్ వరకు ఎన్నో ఖర్చులు భరించాల్సి ఉంటుంది. అందుకే పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేయడం.. ఈ రెండు పనులు కూడా ఎన్నో ఖర్చులు, సవాళ్లతో కూడుకున్నవే. అందుకేనేమో వేతన జీవుల నెల వారీ వేతనం నుంచి కట్ చేసే పీఎఫ్ డబ్బుల్లోంచి కొత్త మొత్తాన్ని తిరిగి విత్‌డ్రా చేసుకుని ఉపయోగించుకునేందుకు అవకాశం ఇచ్చిన వాటిలో ఇంటి నిర్మాణం, ఇంటికి మరమ్మతులు, పెళ్లి వంటి అంశాలు కూడా ఉన్నాయి.
పెళ్లికి ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తోంది వేతన జీవుల నుంచి పీఎఫ్ కింద కొంతమొత్తాన్ని పొదుపుగా దాచిపెడుతోన్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO). అవును, ఈపీఎఫ్ఓలో సేవ్ చేసుకున్న డబ్బులను ఈపీఎఫ్ ఖాతాదారుల పెళ్లికి లేదా వారి ఇంట్లో వారి పెళ్లి అవసరాల కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు. కాకపోతే అందులో 50 శాతం వరకే విత్‌డ్రా చేసుకునేందుకు వీలు ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. అలా ఇంకా ఏమేం నిబంధనలు, షరతులు ఉన్నాయో తెలుసుకుందాం రండి.
ఈపీఎఫ్ఓ ఖాతాదారుల వివాహం లేదా వారి కుమారుడు, కూతురు, సోదరి లేదా సోదరుడి వివాహం కోసం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి 50 శాతం వరకు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతిస్తుంది.
ఏయే సందర్భాల్లో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చంటే..
ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద పొదుపు చేసుకున్న మొత్తాన్ని పదవీ విరమణ చేసిన తర్వాత మొత్తం డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. సర్వీసులో ఉండగా అయితే.. ఇంటి నిర్మాణం, ఇంటికి మరమ్మతులు, హౌజింగ్ లోన్ ఈఎంఐ రీపేమెంట్ లేదా హోమ్ లోన్ క్లోజింగ్, వివాహం వంటి అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
వివాహం కోసం పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు నిబంధనలు..
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాదారులు వారి సొంత వివాహం, లేదా వారి కుమారుడు, కుమార్తె, సోదరి, సోదరుడి వివాహం కోసం కూడా 50 శాతం వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకునే వీలుంది. అందుకోసం ఈపీఎఫ్ ఖాతాలో ఏడేళ్లపాటు నగదు జమ చేసిన వారు అయి ఉండాలి. లేదంటే వివాహం కోసం పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతించదు.
ఇది కూడా చదవండి : Photo Change On Aadhaar Card: ఆధార్ కార్డుపై సరిగ్గా లేని ఫోటో మార్చుకోవడం ఎలా ?
ఉమంగ్ యాప్ ద్వారా డబ్బును ఇలా విత్‌డ్రా చేసుకోండి
Step 1: మీ మొబైల్లో ప్లే స్టోర్లో ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులోకి మీ ఫోన్ నెంబర్ ద్వారా సైన్ ఇన్ అవండి.
Step 2: యాప్‌లో కనిపిస్తున్న ఆప్షన్స్‌ని కిందకు స్క్రోల్ చేస్తూ EPFO అనే ఆప్షన్ ని ఎంచుకోండి.
Step 3: రైజ్ క్లెయిమ్ అనే ఆప్షన్ ఎంచుకుని మీ UAN నంబర్‌ను నమోదు చేయండి.
Step 4: EPFO ఖాతా కోరిన విధంగా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేయండి.
Step 5: మీ పీఎఫ్ ఖాతా నుంచి ఏ కారణం చేత డబ్బులు విత్ డ్రా చేస్తున్నారో.. ఆ కారణం ఎంచుకుని మిగతా వివరాలు ఇవ్వండి.
Step 6: అన్ని డీటేల్స్ నమోదు చేసి మీ బ్యాంక్ ఎకౌంట్ డీటేల్స్ కోసం చెక్‌ని అప్‌లోడ్ చేయండి.
Step 7: ఆధార్ నెంబర్‌కి అనుసంధానం చేసిన మీ ఫోన్ నెంబర్‌కి వచ్చే ఓటిపిని వ్యాలిడేట్ చేసి మీ రిక్వెస్ట్‌ని సబ్మిట్ చేయండి.
Step 8 : ఈపీఎఫ్ఓ 3 రోజుల నుండి వారం, పది రోజులలోపు మీ బ్యాంక్ ఖాతాలో డబ్బును జమ చేస్తుంది.
ఇది కూడా చదవండి : CIBIL Score Facts: సిబిల్ స్కోర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK