How To Check PF Balance: ఉద్యోగం చేస్తున్న వారిలో చాలామందికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్ ఉంటుంది. ప్రతి నెల ఉద్యోగి జీతంలో 12 శాతం.. యాజమాని వాటా కింద 12 శాతం పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. ఇలా జమ అయిన డబ్బును అత్యవసర పరిస్థితుల్లో పెన్షన్ అమౌంట్ మినహాయించి విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఉద్యోగం మానేసినట్లయితే అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించి సబ్మిట్ చేసి మొత్తం డబ్బులు కూడా తీసుకోవచ్చు. లేదంటే పదవీ విరమణ తరువాత ఒకేసారి పెద్ద మొత్తంలో పొందొచ్చు. ఇలా ప్రతి నెల జమ అయిన డబ్బుపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేస్తుంది. ప్రస్తుతం పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. అయితే తమ పీఎఫ్ అకౌంట్‌లో ఎంత నగదు ఉందో చాలామందికి తెలియు. బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలని తెలిసినవారిని అడుగుతుంటారు. ఇక నుంచి మీరు ఎవరిని అడగాల్సిన పనిలేదు. సింపుల్‌గా నాలుగు పద్ధతుల్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ అమౌంట్ చెక్ చేసుకోండి..
మిస్ట్ కాల్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి. నిమిషాల వ్యవధిలో మీ మొబైల్ నంబరుకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. అయితే మీ యూఏఎన్ నంబరు కచ్చితంగా యాక్టివేషన్‌లో ఉండాలి. యూఏఎన్ నంబరుతో ఫోన్ నంబరు లింక్ అయి ఉండాలి.
ఎస్ఎమ్ఎస్ ద్వారా ఇలా..
మిస్ట్ కాల్ ద్వారా కాకుండా.. ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN నంబర్‌ని టైప్ చేసి 77382 99899 నంబరుకు మెసేజ్ పంపాలి. నిమిషాల వ్యవధిలో మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు మీకు మెసేజ్ రూపంలో వస్తుంది.
ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోండి..
మీ స్మార్ట్ ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి.. ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. ఆ తరువాత అన్ని సేవల ఆప్షన్‌ను ఎంచుకుని.. EPFO ఆప్షన్‌కు వెళ్లండి. ఇక్కడ పాస్‌బుక్‌ని చూడండి. యూఏఎన్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయండి. OTPని నమోదు చేయండి. దీని తర్వాత, మీరు ఖాతాలో జమ చేసిన మొత్తం గురించి సమాచారాన్ని పొందుతారు.
Also Read: YS Sunitha Reddy: టీడీపీలోకి వైఎస్ సునీతారెడ్డి.. పోస్టర్లు కలకలం
ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్ ద్వారా ఇలా..
ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.in ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ లాగిన్ అయిన తరువాత మా సేవల జాబితాను ఎంచుకోండి. ఇక్కడ ఉద్యోగుల కోసం ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి. ఆ తరువాత మెంబర్ పాస్‌బుక్‌ని ఎంచుకోండి. యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి.. బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
Also Read: TTD Fake Websites: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ వెబ్‌సైట్‌ను నమ్మొద్దు.. ఇలా గుర్తించండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook