ATM Rules: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక.. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా..? కొత్త నిబంధనలు ఇవే..
ATM Transaction Limit: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఏటీఎం లావాదేవీలకు సబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చిచింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇవే..
ATM Transaction Limit: మీరు ఏటీఎం లేదా కార్డ్ ద్వారా డబ్బు లావాదేవీలు చేస్తున్నారా..? అయితే మారిన కొత్త నిబంధనలు తెలుసుకోండి. ఏటీఎం లావాదేవీకి సంబంధించిన నిబంధనలకు సంబంధించి కెనరా బ్యాంక్ కీలక మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏటీఎం నగదు, POC అలాగే ఈ-కామర్స్ లావాదేవీల రోజువారీ లావాదేవీల పరిమితిని పెంచింది.
కొత్త నిబంధనల గురించి బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం ఇచ్చింది. కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం.. కార్డ్ లావాదేవీల భద్రతను కూడా బ్యాంక్ పెంచింది. క్లాసిక్ డెబిట్ కార్డ్ ఏటీఎం లావాదేవీ పరిమితిని బ్యాంక్ రోజుకు రూ.40 వేల నుంచి నుంచి రూ.75 వేలకు పెంచింది.
POS క్యాప్ కూడా పెరిగింది
అంతేకాకుండా.. ఈ కార్డులకు రోజువారీ క్యాప్‌ను లక్ష నుంచి 2 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. మరోవైపు మీరు క్లాసిక్ డెబిట్ కార్డ్ ద్వారా NFC కోసం రోజువారీ లావాదేవీ పరిమితిని రూ.25 వేలుగా ఉంచాలని నిర్ణయించుకుంటే.. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు.
రూ.5 లక్షలకు పరిమితి పెంపు..
ప్లాటినం/బిజినెస్/సెలెక్ట్ డెబిట్ కార్డ్ నగదు లావాదేవీల పరిమితిని కూడా పెంచారు. 50 వేల నుంచి రూ.5 లక్షకు పెంచాలని నిర్ణయించారు. అదేవిధంగా POS కోసం రోజువారీ లావాదేవీల పరిమితిని రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా డెబిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించి పరిమితిలో కీలక మార్పులు చేసింది. ప్లాటినం మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్‌లతో పాటు రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డు పరిమితిని పెంచనుంది. ఈ మేరకు పీఎన్‌బీ వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు షాక్ తగలనుంది. థర్డ్ పార్టీ నుంచి రెంట్ పేమెంట్ చేస్తే.. ఆ వినియోగదారులు చేసిన లావాదేవీ మొత్తంలో ఒక శాతం ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
Also Read: Ind Vs Ban: బంగ్లాతో వన్డేకు ఓపెనర్‌గా ధావన్ ప్లేస్‌లో విధ్వంసకర ఆటగాడు.. రోహిత్ శర్మ ప్లాన్ అదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి