Car Buying Tips: కొత్త కారు కొనేముందు ఈ సూచనలు పాటిస్తే చాలు..మీ డబ్బు ఆదా అవుతుంది
Car Buying Tips: సొంత ఇళ్లు..సొంత కారు అనేది చాలామంది కల. మీరు కూడా సొంత కారు కొనాలనుకుంటుంటే..కొన్ని సూచనలు పాటించాల్సిందే. లేకపోతే మీ డబ్బు వృధా అవుతుంది. ఏ చిన్న పొరపాటు చేసినా ఖర్చు పెరిగిపోతుంది.
కొత్త కారు కొనాలనేది అందరికీ ఉండే కల. ఏళ్ల తరబడి కష్టార్జితాన్ని దాచుకుని మరీ కల సాకారం చేసుకుంటుంటారు. అందుకే కారు కొనుగోలు చేసేటప్పుడు ఏ మాత్రం పొరపాటు చేయకూడదు. ఏ చిన్న పొరపాటు చేసినా మీ ఖర్చు పెరిగిపోతుంటుంది. అందుకే కారు కొనేటప్పుడు ఎలాంటి సూచనలు పాటించాలో మీ కోసం ఆ వివరాలు అందిస్తున్నాం.
కారు కొనేముందు ఏ ఒక్క డీలర్‌పై ఆధారపడవద్దు. వేర్వేరు షోరూంలకు వెళ్లి ధర, ఫీచర్లు పరిశీలించండి. మీ బడ్జెట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో డీలర్లు మిమ్మల్ని మాటల్లో పెట్టి..కొత్త కొత్త ఫీచర్ల పేరుతో ఖరీదైన కారును కొనేలా చేస్తుంటారు.
మరీ ముఖ్యంగా కారు కొనేటప్పుడు కంపెనీ నుంచి వచ్చే డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవాలి. కారు ఆన్ రోడ్ ధరను సరిగ్గా పరిశీలించుకోవాలి. వీలైతే ఇన్సూరెన్స్ మీకిష్టమైంది ఎంచుకోండి. షోరూం సిబ్బంది ఎంపిక చేసిన ఇన్సూరెన్స్ ఎంచుకోవద్దు.
కొంతమంది డీలర్ల దగ్గర స్టాక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తుంటారు. అలాంటిది ఎంచుకుంటే చాలావరకూ మీ డబ్బులు ఆదా అవుతాయి. తక్కువ ధరకే కారు కొనే అవకాశముంటుంది.
త్వరగా డెలివరీ తీసుకునే కారణంతో బ్రోకర్లను లేదా రిటైలర్లను ఎంచుకోవద్దు. నేరుగా డీలర్‌నే సంప్రదించాలి. మీ లోన్‌ను బ్యాంకు ద్వారానే తీసుకోండి. ఎందుకంటే డీలర్లతో పోలిస్తే ఇది తక్కువగా ఉంటుంది. దీనికి కొద్దిగా సమయం తీసుకున్నా..ఖర్చు ఎక్కువ కాకుండా ఉంటుంది.
Also read: Banks alert: మార్చి నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook