March 2023 Bank Holidays: మీకు బ్యాంకుతో ముఖ్యమైన పని ఏమైనా ఉంటే ముందుగా బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవడం మంచిది. మార్చి నెలలో బ్యాంకులు ఎప్పుడెప్పుడు పనిచేయవో ఆర్బీఐ సెలవుల జాబితా రిలీజ్ చేసింది. వచ్చే నెలలో మెుత్తంగా 12 రోజులపాటు బ్యాంకులు నడవవు. ముఖ్యమైన పండుగలు, తదితర కారణాలు వల్ల రాష్ట్రాలు సెలవులు ప్రకటిస్తాయి. ఆ రోజుల్లో కూడా బ్యాంకులు మూసివేయబడతాయి. దీనికి ఆర్బీఐకి సంబంధం లేదు. మార్చి నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏయే రోజుల్లో వర్క్ చేయవో తెలుసుకుందాం.
మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితా:
మార్చి 3 - చాప్‌చార్ కుట్
మార్చి 5 - ఆదివారం
మార్చి 7- హోలికా దహన్/ధులండి/డోల్ జాత్రా
మార్చి 8 - ధూలేటి/డోల్జాత్రా/హోలీ/యోసాంగ్ 2వ రోజు
మార్చి 9 - హోలీ
మార్చి 11- నెలలో రెండవ శనివారం
మార్చి 12 -ఆదివారం
మార్చి 19 - ఆదివారం
మార్చి 22 - గుడి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం
మార్చి 25 - నాల్గవ శనివారం
మార్చి 26 - ఆదివారం
మార్చి 30 - శ్రీరామ నవమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.