Car Loan EMI: మార్కెట్ లో ఎన్ని రకాల కార్ల కంపెనీలు ఉన్నాయో అన్నీ కార్ ఫైనాన్స్ కూడా అవే చేయిస్తుంటాయి. కస్టమర్ తీసుకునే రుణం, అతని అర్హత, సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ ఎంతనేది నిర్ధారణ అవుతుంటుంది. అదే కారు లోను వడ్డీ లేకుండా లభిస్తుంటే ఎలా ఉంటుందో ఆలోచించారా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాంకింగ్ లోన్ లేదా ఇతర ఫైనాన్స్ సంస్థలతో కార్ ఫైనాన్సింగ్ చేయిస్తుంటారు. వడ్డీ ఎక్కువ కావడంతో అటు ఈఎంఐ కూడా భారమౌతుంటుంది. జీరో పర్సంట్ వడ్డీతో కారు రుణాలనేవి ఎక్కడా లేవు. జీరో పర్సంట్ అనేది కేవలం ఇంటి గృహోపకరణాలకే పరిమితం. కారు లోన్ అనేటప్పటికి వడ్డీ కచ్చితంగా ఉంటుంది. జీరో ఈఎంఐ అనేది ఉండదు. కానీ కొద్దిగా తెలివిగా వ్యవహరిస్తే పరోక్షంగా సాధ్యమేనంటున్నారు మార్కెట్ నిపుణులు. అంటే వడ్డీ రూపంలో చెల్లించే మొత్తాన్ని మరో విధానంలో తిరిగి పొందవచ్చంటున్నారు. ఇదేదో మీకు కాస్త సందిగ్దంగా అన్పించొచ్చు. వివరంగా పరిశీలిద్దాం..


మీరు బ్యాంకు నుంచి 5 ఏళ్ల వ్యవధికై 5 లక్షల రూపాయలు కారు లోన్ తీసుకుంటే బ్యాంక్ 8 శాతం వడ్డీ విధించిందనుకుందాం..యాక్సిస్ బ్యాంక్ లోన్ క్యాలుక్యులేటర్ ప్రకారం 5 ఏళ్లలో మీరు 1 లక్షా 8 వేల 292 రూపాయలు వడ్డీ రూపంలో చెల్లిస్తారు. దీనికోసం ఈఎంఐ 10, 138 రూపాయలుంటుంది. అంటే లోన్ చెల్లించేందుకు ప్రతి నెలా 10 వేల రూపాయలు చెల్లించాలి. 


ఎస్ఐపీలో పెట్టుబడి చేస్తే..


మీరు కార్ లోన్ తీసుకున్నప్పుడే ఎస్ఐపీ ప్రారంభిస్తే ఇందులో ప్రతి నెలా 5 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ 5 ఏళ్ల కాల వ్యవధి తరువాత 14 శాతం రిటర్న్ లభిస్తుంది. అంటే 1.36 లక్షల రూపాయలు రిటర్న్ అందుతుంది. ఇది మీరు కారు లోన్‌కు చెల్లించే వడ్డీ కంటే అధికమే. 


లోన్ వర్సెస్ ఎస్ఐపీ లెక్కింపు


ఇదే విధంగా మీరు మీ క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు. మీరు ఎంత కారు లోన్ తీసుకున్నా అదే మొత్తం లెక్కించి ఎస్ఐపీ ప్రారంభించాల్సి ఉంటుంది. దీనివల్ల మీ లోన్‌పై మీరు చెల్లించే వడ్డీ, మీ ఎస్ఐపీ ద్వారా వచ్చే రిటర్న్‌తో పోలిస్తే తక్కువే ఉంటుంది. అంటే ఎస్ఐపీ రిటర్న్ రూపంలో మీరు బ్యాంకుకు చెల్లించే వడ్డీని తిరిగి పొందవచ్చు.


Also read: Best EV Car: ఈ ఎలక్ట్రిక్ కారుపైనే అందరికీ క్రేజ్, అప్పుడే 50 వేల యూనిట్ల విక్రయాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook