Car Sales 2022, Hyundai Creta is highest selling SUV car in 2022: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్'. ఈ సంస్థకు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే.. హ్యుందాయ్ నుంచి వచ్చే ప్రతి మోడల్ దాదాపుగా సక్సెస్ అయింది. ప్రతి సంవత్సరం హ్యుందాయ్ కంపెనీ అత్యధిక విక్రయాలను కలిగి ఉంటుంది. ఎప్పటిలానే గత ఏడాది కూడా భారత్‌లో మంచి ఫలితాలు సాధించింది. 2022లో హ్యుందాయ్ కంపెనీ మొత్తం 552,511 యూనిట్లను విక్రయించింది. ఇది ఒక క్యాలెండర్ ఇయర్‌లో హ్యుందాయ్ బ్రాండ్‌కు అత్యధిక విక్రయాల సంఖ్య. 2018లో కంపెనీ అత్యధికంగా 550,002 యూనిట్లను విక్రయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022లో హ్యుందాయ్ కంపెనీ అన్ని యూనిట్లను విక్రయించడానికి కారణం 'క్రెటా' SUV కార్. క్రెటా కార్లు ఏడాది పొడవునా విక్రయించబడ్డాయి. అమ్మకాల విషయానికొస్తే.. హ్యుందాయ్ కంపెనీకి చెందిన అన్ని కార్లు (చిన్న నుండి పెద్ద వరకు) క్రెటా కంటే వెనుకబడి ఉన్నాయి. కంపెనీ లెక్కల ప్రకారం.. 2022 సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 140,895 యూనిట్ల క్రెటా కార్లు విక్రయించబడ్డాయి. 2015లో క్రెటా కార్ విడుదల అయినప్పటి నుంచి ఇదే అత్యధికం. 2022లో భారత్ నుంచి 148,300 కార్లను ఎగుమతి చేస్తామని హ్యుందాయ్ ప్రకటించింది.


2022 మొత్తం అమ్మకాలలో SUVలు 50 శాతానికి పైగా ఉన్నాయని వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ పేర్కొంది. హ్యుందాయ్ క్రెటా కాకుండా.. కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, ఐ20 ఎన్ లైన్, ఆరా, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, వెర్నా, అల్కాజార్, టక్సన్ మరియు కోనా ఎలక్ట్రిక్ వంటి మరో పది వాహనాలను భారతదేశంలో విక్రయిస్తోంది.


హ్యుందాయ్ కంపెనీ మేజర్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో. వినియోగదారులు ఈ కార్లను కొనుగోలు చేయడంతోనే తన అత్యధిక దేశీయ విక్రయాలను నమోదు చేసిందని హ్యుందాయ్ పేర్కొంది. 2022లో అత్యధిక కార్ల అమ్మకానికి కారణం SUV శ్రేణి అని, ముఖ్యంగా బెస్ట్ సెల్లర్ మోడల్ క్రెటా అని చెప్పింది. హ్యుందాయ్ కంపెనీ తన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా త్వరలో తీసుకువచ్చే అవకాశం ఉంది. 


Also Read: Best Cruisers Bikes: 2 లక్షల లోపు బెస్ట్ క్రూయిజర్ బైక్స్.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లినా అలసట ఉండదు!  


Also Read: Cheapest Smart TV: 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరలోనే.. 55 ఇంచ్ స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది! ఎగబడుతున్న జనం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.