Cheapest Smart TV: 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరలోనే.. 55 ఇంచ్ స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది! ఎగబడుతున్న జనం

Best Smart TV, 55 Inch Thomson Smart TV gets Very Cheaper in Flipkart. 55 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?. మీకోసం చీప్ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 3, 2023, 12:50 PM IST
  • 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరలోనే
  • 55 ఇంచ్ స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది
  • ఎగబడుతున్న జనం
Cheapest Smart TV: 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరలోనే.. 55 ఇంచ్ స్మార్ట్ టీవీ వచ్చేస్తుంది! ఎగబడుతున్న జనం

Cheap Smart TV, Thomson 55 inch smart TV buy only Rs 18,999 in Flipkart: భారతదేశంలో ప్రస్తుతం స్మార్ట్ టీవీలకు ఫుల్ డిమాండ్ ఉంది. బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుండటంతో.. వీటిని కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిఒక్కరు తక్కువ ధరలో బ్రాండ్​, డిస్​ప్లే, సౌండ్ క్వాలిటీ, కనెక్టివిటీ ఆప్షన్ల కోసం వెతుకుతుంటారు. మీ బడ్జెట్ తక్కువగా ఉండి.. 55 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?. మీకోసం ఒక చీప్ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. దాని ధర కూడా మీరు అస్సలు ఊహించరు. 

అతి తక్కువ ధరలో దొరికే 55-అంగుళాల స్మార్ట్ టీవీ మరేదో కాదు 'థామ్సన్'. ఈ స్మార్ట్ టీవీని వినియోగదారులు 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరతో కొనుగోలు చేయొచ్చు. ఆ వివరాలు ఓసారి చూద్దాం. Thomson OATHPRO Max 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 54,999. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీపై 45 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో వినియోగదారులు రూ. 29,999లకు కొనుగోలుచేయొచ్చు. 

థామ్సన్ 55 ఇంచ్ టీవీకి రూ. 29,999 కూడా ఎక్కువగా ఉంటుందని మీరు భావిస్తే.. చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ టీవీ మరింత సరసమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ స్మార్ట్‌ టీవీపై రూ. 11000 మరో ఆఫర్ అందిస్తోంది. అదే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్. మీ ఇంట్లో పాత ఎల్ఈడీ టీవీ (LED TV) ఉంటే.. మీరు దానిని మార్చుకొని ఈ బోనస్‌ను పొందవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మొత్తం వర్తిస్తే.. థామ్సన్ 55 ఇంచ్ టీవీని మీరు రూ. 18,999 ఇంటికి తీసుకెళిపోవచ్చు. 

Also Read: Best Cruisers Bikes: 2 లక్షల లోపు బెస్ట్ క్రూయిజర్ బైక్స్.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లినా అలసట ఉండదు!  

Also Read: Ola Electric Scooters: ఈ భారతీయ కంపెనీ 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.. సక్సెస్‌కు అసలు కారణాలు ఇవేనా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News