Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై భారతదేశం కీలక నిర్ణయం తీసుకోనుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే కొన్ని రకాల క్రిప్టోకరెన్సీలపై ఇండియాలో నిషేధం పడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న క్రిప్టోకరెన్సీకు(Cryptocurrency) ముకుతాడు విధించేందుకే కేంద్రం నిర్ణయించింది. క్రిప్టోకరెన్సీపై కేంద్ర ప్రభుత్వం(Central government) కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ బిల్లు 2021ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. 


మరోవైపు క్రిప్టోకరెన్సీని ఇన్‌కంటాక్స్ నెట్ పరిధిలో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సంబంధిత ఆదాయపు పన్ను చట్టాలలో మార్పులు చేసేందుకు పరిశీలన చేస్తోందని సమాచారం. ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీపై ఎటువంటి నియంత్రణ గానీ నిషేధం గానీ లేదు. గత వారం క్రిప్టోకరెన్సీ అవకాశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో క్రిప్టోకరెన్సీపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రిప్టోకరెన్సీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే..పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. యువత కూడా నాశనమవుతుందన్నారు. దేశంలో క్రిప్టోకరెన్సీపై దాదాపు పదికోట్లమంది పెట్టుబడి పెడుతున్నారు. 


పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో(Parliament Winter Sessions) ప్రవేశపెట్టాలనుకుంటున్న క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లుతో దేశంలో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై వేటు పడుతుంది. అదే సమయంలో బిల్లులో కొన్ని మినహాయింపులు కూడా ఉండవచ్చు. క్రిప్టోకరెన్సీని నియంత్రించాల్సిన సమయం వచ్చిందని పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న క్రిప్టోకరెన్సీ బిల్లు(Cryptocurrency Bill) ఆమోదం పొందితే దేశంలో పలు రకాల అధికారిక డిజిటల్ కరెన్సీ అందుబాటులో రానుంది. 


Also read: త్వరలో పూర్తి కానున్న జీల్ - సోనీ విలీన ప్రక్రియ : పునీత్ గోయెంకా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook