త్వరలో పూర్తి కానున్న జీల్ - సోనీ విలీన ప్రక్రియ : పునీత్ గోయెంకా

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్, సోనీ విలీన ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. జీల్ - సోనీ విలీనానికి సంబంధించిన అంశాల్ని ఆ జీల్ ఎండీ సీఈఓ పునీత్ గోయెంకా వెల్లడించారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 24, 2021, 06:12 AM IST
  • త్వరలో పూర్తి కానున్న జీల్-సోనీ సంస్థల విలీన ప్రక్రియ
  • జీల్ -సోనీ సంస్థల విలీనం తుది దశలో ఉందని వెల్లడించిన జీల్ ఎండీ పునీత్ గోయెంకా
  • ఏపీఓ ఇండియా సమ్మిట్‌లో మాట్లాడిన పునీత్ గోయెంకా
త్వరలో పూర్తి కానున్న జీల్ - సోనీ విలీన ప్రక్రియ : పునీత్ గోయెంకా

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్, సోనీ విలీన ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. జీల్ - సోనీ విలీనానికి సంబంధించిన అంశాల్ని ఆ జీల్ ఎండీ సీఈఓ పునీత్ గోయెంకా వెల్లడించారు. 

జీల్, సోనీ సంస్థలు(Zeel-Sony Merger) విలీనం కానున్నాయనే సంగతి తెలిసిందే. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా సంస్థల విలీన ప్రక్రియపై జీల్ ఎండీగా సీఈవోగా ఉన్న పునీత గోయెంకా కీలకమైన విషయాల్ని వెల్లడించారు. APOS ఇండియా సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. 

జీల్-సోనీ సంస్థల విలీనం షేర్ హోల్డర్లకు మంచి ప్రయోజనం కల్గించడమే కాకుండా పరిశ్రమకు లాభం చేకూరుస్తుందని పునీత్ గోయెంకా తెలిపారు. జీల్-సోనీ(Zeel-Sony) సంస్థల విలీన ప్రక్రియ ప్రస్తుతం చివరిదశలో ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థల విలీన ప్రక్రియ నడుస్తోందన్నారు. ఈ రెండు సంస్థల విలీనంతో ప్రపంచంలోనే అతి పెద్ద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేయర్‌గా(World largest media entertainment player) జీ-సోనీ నిలబడనున్నాయని పునీత్ గోయెంకా(Punit Goenka) తెలిపారు. రెండు సంస్లల ఆదాయం 2 బిలియన్ డాలర్లకు చేరువలో ఉందన్నారు. సోనీ సంస్థ పెట్టబోతున్న 1.575 బిలియన్ డాలర్ల మూలధనంతో క్రీడలు సహా ప్రీమియం కంటెంట్‌లో పెట్టుబడులకు అవకాశం కల్గిస్తుందన్నారు. ఫలితంగా తమ షేర్ హోల్డర్లకు అదనపు ప్రయోజనం చేకూర్చగలమన్నారు. 

మరింత సంపద సృష్టించే క్రమంలో క్రీడలపై ఎక్కువ దృష్టి సారించనున్నామని పునీత్ గోయెంకా చెప్పారు. ఈ అవకాశం చాలా మంచిదని..డిజిటల్ ల్యాండ్ స్కేప్(Digital Landscape) అనేది సంపద వృద్ధి చేసేందుకు కొత్త అవకాశాల్ని కల్పించిందన్నారు. ఐదేళ్ల క్రితం ఈ పరిస్థితి లేదన్నారు. క్రీడారంగం కీలకంగా మారనుందన్నారు. విలీన సంస్థ క్రీడలపై ప్రధానంగా దృష్టి పెట్టనుందని పునీత్ గోయెంకా వెల్లడించారు. వాస్తవానికి కరోనా మహమ్మారికి ముందు కేవలం కంటెంట్ కోసం 4-5 కోట్ల మంది చెల్లించగలరని ఎవరూ ఊహించలేదన్నారు. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరగవచ్చని గోయెంకా తెలిపారు. భారతదేశంలో సబ్‌స్క్రిప్షన్ వీడియా ఆన్ డిమాండ్ అంటే SVOD మార్కెట్(SVOD Market) రానున్న ఐదేళ్లలో 20 కోట్లకు పెరగవచ్చని గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు. 

Also read: దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఢిల్లీలో అత్యధిక ధర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x