Cheap And Best Mileage Scooters: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో చాలా మంది కార్లను పక్కనపెట్టి వీలైతే టూ వీలర్స్‌పైనే ట్రావెల్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నిత్యం ఆఫీసుకు వెళ్లే వాళ్లు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్స్‌పై ఈజీగా వెళ్లొచ్చే ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం స్కూటర్స్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో లభించడంతో పాటు ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుజుకి యాక్సెస్ 125 :
అత్యంత తక్కువ ధరకే లభించే అతి కొద్ది స్కూటర్స్ లో యుజుకి యాక్సిస్ 125 ఒకటి. సుజుకి యాక్సెస్ 125 ఎక్స్- షోరూం ధర కేవలం రూ. 79,899  మాత్రమే. 8.58 hp పవర్, 10 Nm టార్క్ జనరేట్ చేసే సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ 4 స్ట్రోక్ ఇంజన్, 124 CC సామర్ధ్యంతో రూపొందింది. ఈ సుజుకి యాక్సిస్ 125 స్కూటర్ మైలేజ్ విషయానికొస్తే.. 57.22 కిమీ మైలేజ్ ఇస్తుంది.


టీవీఎస్ జుపిటర్ 125 : 
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ తరువాత మళ్లీ తక్కువ ధరలో లభించే స్కూటర్ టీవీఎస్ జుపిటర్ 125. ఈ టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ ఎక్స్-షోరూం ఖరీదు రూ. 83,855 గా ఉంది. ఇది 124.8 CC BS6 ఇంజన్ ఆధారంగా రూపొందిన ఈ టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ 8hp పవర్, 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ లీటర్ పెట్రోల్ కి 50 కిమీ మైలేజ్ ఇస్తుంది.


యమహా ఫాసినో 125 : 
సుజుకి యాక్సెస్ 125 కంటే తక్కువ ధరలో లభించే మరో స్కూటర్ పేరే యమహా ఫాసినో 125 స్కూటర్. ఈ స్కూటర్ ఎక్స్-షోరూం ధర రూ. 79,600 మాత్రమే. ఈ 125 CC స్కూటర్ 8hp పవర్, 10.3 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. యమహా ఫాసినో 125 స్కూటర్ లీటర్ పెట్రోల్ కి 50 కిమీ మైలేజ్ ఇస్తుంది అని యమహా కంపెనీ పేర్కొంది.


యమహా రెజర్ 125 : 
యమహా రెజర్ 125 స్కూటర్ ఎక్స్-షోరూం ధర రూ. 84,730 గా ఉంది. 8hp పవర్, 10.3 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఈ 125 CC స్కూటర్ లీటర్ పెట్రోల్ కి 58 కిమీ మైలేజ్ ఇస్తుంది. 


ఇది కూడా చదవండి : Income Tax Filing 2023: ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ ట్యాక్స్ ఫైల్ చేయడం ఎలా..? పూర్తి వివరాలు ఇలా..!


హోండా యాక్టివా 6G :
ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న 125CC స్కూటర్స్ లో హోండా యాక్టివా 6G స్కూటర్ అన్నింటి కంటే ముందుంది. అందుకు కారణం ఈ స్కూటర్ సరసమైన ధరలో లభించడంతో పాటు అధిక మైలేజ్ ఇవ్వడమే. ఔను హోండా యాక్టివా 6G ఎక్స్-షోరూం ఖరీదు 76,234 రూపాయలు కాగా దీని మైలేజ్ 55 కిమీగా ఉంది.


ఇది కూడా చదవండి : Post Office Savings Account: పోస్టాఫీసు ఖాతాదారులకు అలర్ట్.. ఈ నిబంధనల్లో మార్పులు.. తప్పక తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి