మార్కెట్‌లోకి కొత్త Honda Activa 6G.. పెట్రోల్ ఇక 10 శాతం ఆదా..

హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా కంపెనీ దేశీయ వాహన మార్కెట్లోకి కొత్తగా 6జీ యాక్టివా స్కూటర్‌ లాంచ్ చేసింది. 

  • Nov 27, 2020, 01:22 AM IST

Honda Activa 6G launched in India: భారత మార్కెట్లోకి యాక్టివా బ్రాండ్‌ అందుబాటులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మోడల్‌ను లాంచ్ చేసినట్టు హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా పేర్కొంది.

1 /6

హోండా యాక్టివా 6జి స్టాండర్డ్, హోండా యాక్టివా 6జి డిలక్స్ అనే రెండు వేరియెంట్స్‌లో ఈ యాక్టివా 6జి స్కూటర్ లభించనుంది. 

2 /6

హోండా యాక్టివా 6జి స్టాండర్డ్ మోడల్ ఎక్స్-షోరూం ధర రూ.66,816 కాగా హోండా యాక్టివా 6జి డిలక్స్ ధర రూ.68,316గా ఉంది.   

3 /6

గత రెండు దశాబ్ధాలుగా 2 కోట్లకు పైగా యాక్టివా విక్రయాలు జరిపినట్లు కంపెనీ స్పష్టంచేసింది. ఇది కేవలం కంపెనీపై వినియోగదారులకు ఉన్న నమ్మకం వల్లే సాధ్యమైందని హోండా ఇండియా అభిప్రాయపడింది.

4 /6

BS6 మోడల్‌తో వస్తున్న యాక్టివా 6జి స్కూటర్ 110cc సామర్ధ్యం ఇంజిన్ కలిగి ఉంది.

5 /6

ఇందులో ఉన్న హోండా ఇకో టెక్నాలజీ సాయంతో 10 శాతం ఇంధనం ఆదా చేయవచ్చని హోండా కంపెనీ చెబుతోంది.

6 /6

హోండా యాక్టివా 6జిలో 26 కొత్త పేటెంట్ అప్లికేషన్స్ తీసుకొస్తున్నట్టు హోండా ఇండియా కంపెనీ వెల్లడించింది. ఎప్పటికప్పుడు రాబోయే రోజుల్లో అవసరమైన అధునాతన టెక్నాలజీని అంతకంటే ముందే ప్రవేశపెట్టేందుకు తమ కంపెనీ అన్ని ప్రయత్నాలు చేస్తుందని హోండా ఇండియా అభిప్రాయపడింది.