Post Office Savings Account New Rules: పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. జాయింట్ ఖాతాదారుల సంఖ్యను పెంచడంతోపాటు విత్ డ్రాకు సంబంధించిన నిబంధనలను మార్చింది. మీకు పోస్టాఫీసులో సేవింగ్ అకౌంట్ ఉంటే తప్పకుండా మారిన నిబంధనలు తెలుసుకోండి. ఇందుకు కోసం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (సవరణ) స్కీమ్ 2023 నోటిఫికేషన్ జూలైలో జారీ చేసింది. ఏ రూల్స్‌లో మార్పులు జరిగాయి..? వివరాలు ఇలా..
జాయింట్ అకౌంట్
ఇప్పటివరకు మీరు రెండు జాయింట్ అకౌంట్ హోల్డింగ్‌లలో పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్‌ను తెరిచే అవకాశం ఉంది. ఇక నుంచి దానిని మూడుకు పెంచారు. దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ స్కీమ్ 2019లోని 3వ పేరాలోని సబ్-పేరా (1), క్లాజ్ (బి)లో “ఇద్దరు పెద్దలు జాయింట్‌గా” బదులుగా “గరిష్టంగా ముగ్గురు పెద్దలు సంయుక్తంగా” అని నోటిఫికేషన్‌లో మార్పులు చేశారు.
విత్ డ్రా ఫారమ్‌లో ఇలా..
ఉపసంహరణ ఫారమ్ ఫారమ్ 2 నుంచి ఫారమ్ 3కి మార్చారు. రూ.50 విత్‌డ్రా చేయాలంటే.. మీ పాస్‌బుక్‌ను చూపించాల్సి ఉంటుంది. రూ.50 కంటే ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటే ఫారం నింపి సంతకం చేసి పాస్‌బుక్‌తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా చెక్, ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా ఉపసంహరణలపై కనీస బ్యాలెన్స్ అవసరం ఉండాలి. అంటే మీరు ఈ పద్ధతుల ద్వారా డబ్బును విత్‌డ్రా చేస్తుంటే.. మీ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లిమిట్ కంటే ఎక్కువ డబ్బు ఉన్నప్పుడే విత్ డ్రాకు అవకాశం ఉంటుంది.
వడ్డీ విషయంలో..
ఇప్పుడు కొత్త పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (సవరణ) పథకం 2023 ప్రకారం.. “ప్రిన్సిపల్ స్కీమ్‌లో పేరా 5లో సబ్-పేరా (5) “నెల చివరిలో” అనే పదాల కోసం “ఎట్ నెలాఖరున” ఉపయోగించారు. 10వ రోజు, నెలాఖరు మధ్య ఖాతాలో అత్యల్ప బ్యాలెన్స్‌కు సంవత్సరానికి 4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. లెక్కించిన వడ్డీని ఆ సంవత్సరం చివరిలో అకౌంట్ హోల్డర్‌కు అందజేస్తారు. ఖాతాదారుడు మరణిస్తే.. అతని/ఆమె అకౌంట్ క్లోజ్ చేసిన నెలకు ముందు నెల చివరిలో మాత్రమే వడ్డీ చెల్లిస్తారు.
Also Read: TS Group 1 Prelims Exam 2023 Cancelled: గ్రూప్ 1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి