Cheapest Recharge Plan: ఇటీవలి కాలంలో రీఛార్జ్ ప్లాన్స్ ధరలు భారీగానే పెరిగాయి. రూ.200 పైచిలుకు రీఛార్జ్ ప్లాన్స్‌లోనూ నెల రోజుల వాలిడిటీ ఉండట్లేదు. దాదాపుగా అన్ని ప్లాన్స్ 28 రోజుల వరకే పరిమితం చేయబడ్డాయి. కానీ ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్ మాత్రం కేవలం రూ.141 ప్లాన్‌తో 365 రోజుల వాలిడిటీని అందిస్తోంది. ఇంత చౌక ధరలో ఏడాది పాటు వాలిడిటీ మరే నెట్‌వర్క్‌లోనూ అందుబాటులో లేదు. ఎంటీఎన్ఎల్ అందిస్తున్న రూ.141 ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంటీఎన్ఎల్ రూ.141 రీఛార్జ్ ప్లాన్ :


ఎంటీఎన్ఎల్ రూ.141 రీఛార్జ్ ప్లాన్‌తో 90 రోజుల పాటు రోజుకు 1 జీబీ డేటా పొందుతారు. అలాగే ఎంటీఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. ఇతర నెట్‌వర్క్స్‌కి మాత్రం 90 రోజుల పాటు 200 నిమిషాల కాలింగ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. 90 రోజుల తర్వాత ప్రతీ కాల్‌కి సెకనుకు 0.02 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 365 రోజుల వాలిడిటీ పొందుతారు. 


జియో రూ.149 ప్లాన్ :


ప్రస్తుతం రిలయన్స్ జియో కూడా రూ.149కే చౌక ధరలో రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. అయితే దీని వాలిడిటీ కేవలం 20 రోజులే. ప్రతిరోజూ 1 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్ సౌకర్యం పొందుతారు. అదనంగా, జియో యాప్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది.


ఎయిర్‌టెల్, వీఐ :


ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో రూ.155 ప్లాన్ అందుబాటులో ఉంది. వొడాఫోన్ ఐడియాలో రూ.149 ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.155 ప్లాన్‌ వాలిడిటీ 24 రోజులు. అపరిమిత వాయిస్ కాలింగ్‌, రోజుకు 1 జీబీ డేటా పొందవచ్చు. వొడాఫోన్ ఐడియా రూ.149 ప్లాన్‌తో 21 రోజుల వాలిడిటీ పొందవచ్చు. అపరిమిత కాలింగ్, 1 జీబీ డేటా పొందుతారు.


Also Read: Sidhu Moose Wala Murder: సింగర్ సిద్ధూ హత్యపై సీఎం దిగ్భ్రాంతి... హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశాలు... 


Also Read: Rakesh Tikait Attacked: రైతు నేత రాకేశ్ టికాయత్‌పై బెంగళూరులో దాడి... ముఖం, దుస్తులపై నల్ల సిరా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook