Rakesh Tikait Attacked: భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌పై బెంగళూరులో దాడి జరిగింది. రాకేశ్ టికాయత్ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా అడ్డుకున్న కొందరు ఆయనపై నల్ల సిరాతో దాడి చేశారు. రాకేశ్ టికాయత్ ముఖం, దుస్తులపై సిరా పోశారు. దీంతో రాకేశ్ టికాయత్ అనుచరులకు, దాడి చేసినవారికి మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకున్నారు. కర్ణాటక రైతు సంఘం నేత కొడిహళ్లి చంద్రశేఖర్ అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇటీవల ఓ కన్నడ ఛానెల్ కొడిహళ్లి చంద్రశేఖర్‌కి సంబంధించి ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను బయటపెట్టింది. అందులో చంద్రశేఖర్ రూ.35 కోట్లు డబ్బు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. గతేడాది ఏప్రిల్‌లో కేఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను ముందుండి నడిపించిన చంద్రశేఖర్... ఆ సమ్మెను విరమించడం కోసం రూ.35 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లుగా అందులో కనిపించింది. అయితే చంద్రశేఖర్ ఎవరితో డీల్ కుదుర్చుకున్నారు... అంత డబ్బు ఆయనకు ఎవర్ ఆఫర్ చేశారన్నది తెలియలేదు.
చంద్రశేఖర్ వ్యవహారానికి సంబంధించి కొద్దిరోజులుగా కర్ణాటకలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ వివాదానికి సంబంధించి చంద్రశేఖర్ శనివారం (మే 28) ప్రెస్‌మీట్‌కు సిద్దపడగా జేడీఎస్ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుని నల్ల సిరాతో దాడి చేశారు. తాజాగా ఇదే వివాదంపై ప్రెస్ మీట్ నిర్వహించిన రాకేశ్ టికాయత్... కొడిహళ్లి చంద్రశేఖర్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కొడిహళ్లి చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు రాకేశ్ టికాయత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్ల సిరాతో దాడి చేశారు. ప్రెస్ మీట్ నిర్వహించిన హాల్‌లోనే టికాయత్ అనుచరులతో గొడవకు దిగి కుర్చీలు విసిరేశారు.
ఘటనపై రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడి జరిగిందన్నారు. తమకు పోలీసులు ఎటువంటి భద్రత కల్పించలేదని.. ప్రభుత్వ ప్రోద్భలంతోనే తమపై దాడి జరిగిందని ఆరోపించారు.
Also Read: Whiskey Bottle Auction: ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్.. వేలంలో రూ.10 కోట్లకు విక్రయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook