Cheapest Recharge Plan: రూ.75 తో కాలింగ్, డేటా అది కూడా 30 రోజుల వరకు..!
Cheapest Recharge Plan: ట్రాయ్ సూచనల మేరకు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటన్నింటికన్న తక్కువ ధరలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇప్పుడు చూద్దాం.
Cheapest Recharge Plan: దేశంలో దిగ్గజ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్‌ఐడియాలు ఇటీవల 30 రోజుల ప్లాన్‌ను అందుబుటాలోకి తెచ్చాయి. జియో రూ.256 రూపాయలతో ప్లాన్‌ను అందుబాటులోకి తేగా.. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు రెండు ప్లాన్ల చొప్పున అందుబాటులోకి తెచ్చాయి.
ఇప్పుడు ప్రైవేటు దిగ్గజ టెలికాం సంస్థలకు పోటీగా.. ప్రభుత్వ రంగ టెల్కో బీఎస్ఎన్ఎల్ అత్యంత చౌకైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. 30 రోజుల వ్యాలిడిటీతో.. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇప్పుడు చూద్దాం.
బీఎస్ఎన్ఎల్ మూడు ధరల్లో (రూ.75, రూ.24, రూ.102) 30 రోజుల ప్లాన్స్‌ను అందిస్తుంది..
రూ.75 ప్లాన్‌లో ప్రయోజనాలు..
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో డేటా, కాలింగ్ సహా పలు ప్రయోజనాలు ఉన్నాయి. 30 రోజుల పాటు.. 200 నిమిషాల కాలింగ్ సదుపాయం, 2జీబీ డేటా సహా ఉచిత కాలర్ ట్యూన్ సదుపాయాలను వాడుకోవచ్చు. ఇంట్లో అవసరాలకు మాత్రమే ఫోన్ వాడే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.
రూ.24 ప్లాన్‌తో..
రూ.24 ప్లాన్‌లో డేటా, ఎస్ఎంఎస్ సదుపాయాలు ఉండవు. అయితే ఈ ప్లాన్ల్తో రీఛార్జ్ చేసుకుంటే.. కాలింగ్‌కు నిమిషానికి 20 పైసల చొప్పున మాత్రమే వసూలు చేస్తుంది. ఈ సదుపాయం 30 రోజులు అందుబాటులో ఉంటుంది. కేవలం ఇన్కమింగ్ కోసమే మొబైల్ ఫోన్ వాడే వారకి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.
రూ.102 ప్లాన్‌తో డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్లు..
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ.102 ప్లాన్‌తో కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ సదుపాయాలు పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజులకు 6 వేల వాయిస్ సెకన్ల కాలింగ్ సదుపాయం, 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు వినియోగించుకోవచ్చు. డేటాతో ఎక్కువగా అవసరం లేకుండా కేవలం తక్కువ సమయం కాల్స్ మాట్లాడే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.
Also read: PAN Aadhaar: ఇంకా పాన్-ఆధార్ లింక్ చేయలేదా? ఈ విషయాలు తెలుసుకోండి ఇప్పుడే..
Also read: FASTag collections: రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు..మార్చిలో ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook