PAN Aadhaar: ఇంకా పాన్​-ఆధార్​ లింక్ చేయలేదా? ఈ విషయాలు తెలుసుకోండి ఇప్పుడే..

PAN Aadhaar: ఇంకా పాన్​ నంబర్​ను ఆధార్​తో లింక్​ చేయలేదా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ రెండింటిని అనసుంధానం చేయకుంటే వచ్చే నష్టాలు ఏమిటి? ఇందుకు ఇంకా ఎన్ని రోజులు గడువు ఉంది? పూర్తి వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 05:38 PM IST
  • పాన్-ఆధార్​ లింక్​కు ఆఖరి తేదీ ఎప్పుడు?
  • అనుసంధానం చేయకుంటే ఏమవుతుంది?
  • పాన్ ఇన్​ యాక్టివ్​గా మారితే వచ్చే ఇబ్బందులు
PAN Aadhaar: ఇంకా పాన్​-ఆధార్​ లింక్ చేయలేదా? ఈ విషయాలు తెలుసుకోండి ఇప్పుడే..

PAN Aadhaar: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).. పాన్-ఆధార్​​ లింక్​ చేసేందుకు మార్చి 31తో గడువును ముగించింది. అయినప్పటికీ జరిమానాతో ఇంకా కొంత కాలం పాటు పాన్​-ఆధార్ లింక్ చేసేందుకు అవకాశం ఉంది. మరి ఫైన్​తో ఈ ప్రక్రియ ముగించేందుకు గడువు ఎప్పటి వరకు ఉంది? పాన్​-ఆధార్​ అనుసంధానం చేయకుంటే వచ్చే సమస్యలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

పాన్​-ఆధార్​ లింక్ చేసేందుకు తుది గడువు మార్చి 31తో ముగిసినప్పటికీ.. సీబీడీటీ కొంత ఊరటనిచ్చింది. జరిమానాతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు 2023 మార్చి 31 వరకు అకాశం కల్పించింది. అందులో ఈ ఏడాది జూన్ వరకు రూ.500 జరిమానా ఆ తర్వాత రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఫైన్​తో కూడా పాన్​-ఆధార్​ లింక్ చేయకుంటే.. ఆ పాన్​ కార్డులు నిరుపయోగంగా మారుతాయని వెల్లడించింది సీబీడీటీ. దీనర్ధం పాన్ నంబర్​ పని చేయదు.

పాన్​ ఇన్ యాక్టివ్​గా మారితే.. బ్యాంకు లావాదేవీలపై పరిమితులు ఉంటాయి. పెట్టుబడులు పెట్టలేరు (స్టాక్ మార్కెట్ల వంటివాటిలో). ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయడం కూడా కుదరదు.

పాన్​ నిరుపయోగంగా మారితే.. రీఫండ్స్​ కూడా రావు. దీనితో ఆదాయపు పన్ను విభాగం నుంచి భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి రావచ్చు.

పాన్​ నిరుపయోగంగా మారిన వారి నుంచి సాధారణం కన్నా అధికంగా పన్ను వసూలు చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.

Also read: FASTag collections: రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు..మార్చిలో ఎంతంటే..?

Also read: Renault offers: రెనో కార్లపై అదిరే ఆఫర్లు.. రూ.1.1 లక్షల వరకు డిస్కౌంట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News